Site icon HashtagU Telugu

AP BJP : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌కు సీఐడీ వెళ్లిందా..? : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

Purandhareswari

Purandhareswari

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్ట్‌పై మ‌రోసారి బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి స్పందించారు.తాను స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాట్లపై ప్రకాశం జిల్లాలో వాకబు చేశానని.. చాలా సెంటర్లలో 100 కంప్యూటర్లు ఇచ్చారని తెలిసిందన్నారు. అయితే అస‌లు సీఐడీ అధికారులు ఆయా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌కు వెళ్లిందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ను అరెస్టు చేసిన విధానం సరికాదని మేము చెబుతున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఎన్టీఆర్ కూతురుగా తాను చాలా ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాన‌ని.. సీఎం అయ్యాక కూడా ఎన్టీఆర్ ఫియట్ కారులో వెళ్లేవారని ఆమె గుర్తు చేశారు. అవినీతి ఏస్ధాయిలో ఉన్నా వ్యతిరేకించాలని.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని పురంధేశ్వ‌రి ఆరోపించారు. సీఎం జగన్ మద్యపాన నిషేధంపై మాట్లాడిన వీడియోలను పురంధేశ్వ‌రి ప్ర‌ద‌ర్శించారు.

మద్యంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని.. రాష్ట్రంలో గతంలో ఉన్న మద్యం బ్రాండ్లు తీసేసి కొత్త వాటిని తెచ్చారన్నారు. మద్యం బ్రాండ్లు తయారు జరిగేది ఏపీలోనేన‌ని.. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలే మద్యం తయారీ కంపెనీలు నడుపుతున్నారని ఆమె ఆరోపించారు అధికార పార్టీ ఎంపీ ఒక మద్యం తయారు చేసే కంపెనీని బెదిరించి ఏపీలో ఆ బ్రాండ్ అమ్మకం నిలిపివేశారని ఆమె ఆరోపించారు. ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలను మద్యంలో కలుపుతున్నారని..ఏపీలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రుగుతుంన్నారు. బేవ‌రేజ్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుందని. ఆసరా, అమ్మ వొడి, చేయూత పధకాలకు బేవ‌రేజ్ కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లిస్తున్నారని పురంధేశ్వ‌రి ఆరోపించారు.

మహిళలు పుస్తెలు తెగిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. చీప్ లిక్కర్ తాగడం వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. చీప్ లిక్కర్ తాగడం వలన గుండె‌ జబ్బులు, లివర్ పాడవడం, ఇతర వ్యాధులతో చనిపోతున్నారని.. ప్ర‌కాశం జిల్లాల్లో మద్యం తాగి చనిపోయిన వారే అధికమ‌న్నారు. మద్యం కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేశారు. మద్యం సరఫరాతో తాడేపల్లి ప్యాలెస్ కు 400 కోట్లు వెలుతున్నాయన్నారు. ఏడాదికి 56 వేల 600 కోట్ల ఆదాయం చూపిస్తున్నారన్నారని.. బడ్జెట్ లో 20 వేల కోట్లు చూపిస్తున్నారు మిగతా 25 వేల కోట్లు ఏమవుతున్నాయని ఆమె ప్ర‌శ్నించారు. ఏపీలో అనధికారికంగా‌ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. ప్రజల ప్రాణాలు తీస్తూ జేబులు నింపుకుంటున్నార‌న్నారు.