Site icon HashtagU Telugu

AP BJP : చంద్ర‌బాబు అరెస్ట్ బీజేపీకి సంబంధంలేదు – పురంధేశ్వ‌రి

Purandhareswari

Purandhareswari

చంద్ర‌బాబు అరెస్ట్‌పై బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ని ఆమె తొలిరోజే ఖండించారు. అయితే ఆ త‌రువాత బీజేపీ జాతీయ నాయ‌క‌త్వంకానీ, ఏపీ బీజేపీ నేత‌లు కానీ నోరుమొద‌ప‌లేదు.దీంతో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక బీజేపీ హ‌స్తం ఉంద‌ని భావిస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి దానిపై కూడా స్పందించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌కు బీజేపీకి సంబంధం లేద‌న్నారు. ఆయనను అరెస్టు చేసిన తీరును ఖండించిన మొదటి పార్టీ బీజేపీయేనని, దర్యాప్తు సంస్థ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు కేసుపై చర్చించడం సరికాదని ఉద్ఘాటించారు.. కేసును విచారిస్తున్న సీఐడీ రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, కోర్టు పరిధిలోని అంశాలను చర్చించడం తగదని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.ఇటు పొత్తుల‌పై కూడా ఆమె మాట్లాడారు. సాధారణంగా ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు పొత్తులపై పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికలలోగా పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని పురంధేశ్వరి ఉద్ఘాటించారు.