Site icon HashtagU Telugu

Purandhareswari : అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో ఏపీ బీజేపీ నూత‌న‌ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి.. రేపు సాయంత్రం నేరుగా ఢిల్లీకి

Purandhareswari

Purandhareswari

బీజేపీ (BJP) కేంద్రం అధిష్టానం తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో కీల‌క మార్పులు చేసింది. తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్‌ (Bandi Sanjay) తో పాటు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు (Somu Veerrajula ) ల‌ను తొల‌గించిన విష‌యం తెలిసిందే. వారి స్థానంలో తెలంగాణ‌లో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీలో పురంధ‌రేశ్వ‌రి (Purandhareswari) కి అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కేంద్ర పార్టీ అధిష్టానం అప్ప‌గించింది. తెలంగాణ‌లో కిష‌న్ రెడ్డికి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, ఏపీ పార్టీ ప‌గ్గాలు పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోము వీర్రాజు స్థానంలో ప‌లువురు పేర్లు తెర‌పైకి వ‌చ్చినా పురంధ‌రేశ్వ‌రి పేరు పెద్ద‌గా వినిపించ‌లేదు. కానీ ఊహించ‌ని రీతిలో పురంధ‌రేశ్వ‌రికి ఏపీ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తూ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా పురంధ‌రేశ్వ‌రి నియామ‌కం జ‌రిగిన‌ప్పుడు ఆమె అమ‌ర్నాథ్ యాత్ర‌లో ఉన్నారు. ఈనెల 3న (సోమ‌వారం) అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమర్ నాథ్‌ యాత్రకు పురంధ‌రేశ్వ‌రి బ‌య‌లుదేరి వెళ్లారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధ‌రేశ్వరి పేరును ప్రకటించే సమయంలో ఆమె అమర్నాధ్ యాత్రలో ఉన్నారు. అధ్యక్షురాలిగా ప్రకటించగానే పురంధేశ్వరి కుటుంబంలో సంబ‌రాలు మిన్నంటాయి. పురంధ‌రేశ్వ‌రి అమర్నాధ్ యాత్ర రేప‌టితో ముగుస్తుంద‌ని తెలుస్తోంది. అమర్నాధ్ యాత్ర నుంచి నేరుగా రేపు మధ్యాహ్నం ఆమె ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిసి పదవి ఇచ్చినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌నున్నారు.

Multani Mitti: ముల్తానీ మట్టిని చర్మానికి ఉపయోగించడం మంచిదేనా?

Exit mobile version