Site icon HashtagU Telugu

AP : పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని బిజెపి పిలుపు

Bjpmeeting

Bjpmeeting

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఘట్టం ముగియడం తో ఏపీ ఎన్నికల (AP Elections) ఫై అంత ఫోకస్ పెట్టారు. మరో మూడు నెలలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. ఈసారి టీడీపీ -జనసేన vs వైసీపీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో బిజెపి (BJP) స్పీడ్ కావాలని చూస్తుంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

చర్చల అనంతరం బీజేపీ కీలక నేత సత్యకుమార్ మాట్లాడుతూ.. తమకు పొత్తులు అవసరం లేదని, ఒక వేళ తమతో పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని అన్నారు. తాము ఇప్పటికే పవన్‌తో కలిసి ముందుకు వెళ్తున్నామని, అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని పేర్కొన్నారు. మేము ఎవరితో కలవాలని పవన్ అనుకుంటున్నారో.. ముందు ఆ పార్టీ నుంచి స్పందన రావాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పొత్తులపై అంతిమ నిర్ణయం బీజేపీ అధినాయకత్వానిదేనని ఆయన సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా మాట్లాడించాలన్నారు. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో చెప్పించి ఉండాల్సిందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు ఏపీలో మేం బలహీనంగా ఉన్నాం.. దేశంలో మేం బలంగా ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఇక దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరుగగా.. పొత్తుల్లేకుండా పోటీ చేయగలమా అనే అంశం పైనా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలిసింది. పొత్తుల్లేకుండా పోటీ చేస్తే.. ఓట్లు పెరుగుతాయోమో కానీ.. సీట్లు రావని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.

Read Also : UP School Time: ఉదయం 10 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం