Daggubati Purandeswari : కేక్ కట్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్.. దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు

Daggubati Purandeswari : దివంగత మహానేత నందమూరి తారక రామారావు కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు సోమవారం ఉదయం ఆమె నివాసంలో ఘనంగా జరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Daggubati Purandeswari1

Daggubati Purandeswari1

Daggubati Purandeswari : దివంగత మహానేత నందమూరి తారక రామారావు కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు సోమవారం ఉదయం ఆమె నివాసంలో ఘనంగా జరిగాయి. బర్త్ డే సందర్భంగా తొలుత వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా పురంధేశ్వరికి ఆమె భర్త  దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ నేతల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

We’re now on WhatsApp. Click to Join

ఇదీ నేపథ్యం

దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) 1959 ఏప్రిల్ 22న ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు  రెండో కుమార్తెగా  జన్మించారు. ఆమె బాల్యం, చదువు చెన్నైలోనే సాగింది. పురంధేశ్వరి తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడగలరు, చదవగలరు, రాయగలరు. పురంధేశ్వరి కూచిపూడి నృత్యకారిణి కూడా. 1979లో పురంధేశ్వరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1996లో ఆమె జెమాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆ మరుటి సంవత్సరమే పురంధేశ్వరి హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీని స్థాపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా ఆమె సేవలందించారు. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీలో చేరిన ఆమె ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Also Read :Gukesh : భళా గుకేశ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడు

  Last Updated: 22 Apr 2024, 07:55 AM IST