AP BJP : మాజీ మంత్రి కొడాలి నాని జైలుకే.. BJP కండీష‌న్స్ అప్లై..!

ఏపీలో వైసీపీ, బీజేపీ పార్టీల‌ను(AP BJP) వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు పార్టీలు క‌లిసే అన్నీ చేస్తున్నాయ‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలుసు.

  • Written By:
  • Updated On - May 18, 2023 / 12:36 PM IST

ఏపీలో వైసీపీ, బీజేపీ పార్టీల‌ను(AP BJP) వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు పార్టీలు క‌లిసే అన్నీ చేస్తున్నాయ‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఎందుకంటే, కేంద్రంలోని బీజేపీకి చెప్పిన త‌రువాతే ఏదైనా చేస్తామ‌ని తొలి రోజుల్లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి(Vijayasai Reddy)  చెప్పారు. రాజ‌కీయాల‌కు అతీతంగా మోడీతో బంధం ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల విశాఖ వేదిక‌గా చెప్పిన విష‌యం విదిత‌మే. కానీ, ఏపీ బీజేపీ నేత‌లు మాత్రం వైసీపీ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. చార్జిషీట్ అంటూ ప్ర‌తి జిల్లాలోనూ అవినీతిపై పోరాటం చేయ‌డానికి దిగారు. తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ ధియోధ‌ర్ ఒక అడుగు ముందుకేస్తూ మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నానిని(Kodali Venkateswara rao) జైల్లో పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు.

ఏపీలో వైసీపీ, బీజేపీ పార్టీల‌ను వేర్వేరుగా చూడ‌లేం(AP BJP)

సంక్రాంతి సంద‌ర్భంగా క్యాసినో ఆడించిన విష‌యాన్ని గుర్తు చేస్తే కొడాలి (Kodali Venkateswara rao)మీద మండిప‌డ్డారు. హిందూ సంప్ర‌దాయాలు సంక్రాంతి వేళ ఉంటాయి. వాటిని కాద‌ని క్యాసినో ఆడించ‌డాన్ని సునీల్ (Sunil deodhar) త‌ప్పుబ‌ట్టారు. అలాంటి నేర‌గాళ్ల‌ను బీజేపీ అధికారంలోకి వ‌స్తే జైలుకు పంపిస్తుందంటూ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, బూతులు మాట్లాడే కొడాలి నాని లాంటి వాళ్ల‌ను బీజేపీ(AP BJP) క్ష‌మించ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశాన్ని కూడా సునీల్ ప్ర‌స్తావించారు. ఆయ‌న్ను సీబీఐ విచారిస్తుందంటే వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేద‌ని తెలిసిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. కానీ, ఆ రెండు పార్టీలు గేమాడుతున్నాయ‌ని న‌మ్మేవాళ్లే ఎక్కువ‌. అందుకు ప‌లు కార‌ణాలు లేక‌పోలేదు.

కొడాలి  నానిని  జైల్లో పెడ‌తామ‌ని

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉన్న‌ప్పుడు టీడీపీ కోవ‌ర్ట్ అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్బంగా చంద్ర‌బాబు ఇచ్చిన కిక్ బ్యాగ్స్ తీసుకుని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీకి లోపాయికారి స‌హ‌కారం అందించార‌ని వైసీపీ అప్ప‌ట్లో ఆరోపించింది. బీజేపీ, టీడీపీ క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని చెబుతూ వ‌చ్చారు. సీన్ క‌ట్ చేస్తే క‌న్నా బ‌దులుగా సోము వీర్రాజును బీజేపీ ఏపీ చీఫ్ గా నియ‌మించారు. అంతే, ఆ రోజు నుంచి వైసీపీ, బీజేపీ ఒక‌టేన‌ని ముద్ర‌ప‌డింది. అందుకు త‌గిన విధంగా సోమువీర్రాజు ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీకి వ్య‌తిరేకంగా వాయిస్ వినిపించారు. స‌హ‌జంగా అధికార‌ప‌క్షానికి వ్య‌తిరేకంగా విప‌క్షాలు ఉంటాయి. అందుకు భిన్నంగా జ‌గన్మోహ‌న్ రెడ్డిని కాద‌ని చంద్ర‌బాబు మీద ప‌లు విమ‌ర్శ‌లు (AP BJP) చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

హిందూ దేవాల‌యాల్లో విగ్ర‌హాల కూల్చివేత

హిందూ దేవాల‌యాల్లో విగ్ర‌హాల కూల్చివేత సంద‌ర్భంగా కూడా బీజేపీ(AP BJP) పెద్ద‌గా ఉద్య‌మించ‌లేదు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని అక్ర‌మాలు, లోపాల గురించి గ‌తంలో మాదిరిగా పోరాటం చేయ‌లేదు. దీంతో వైసీపీ, బీజేపీ క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని సంకేతం బ‌లంగా వెళ్లింది. ఆ ముద్ర నుంచి ఎన్నిక‌ల నాటికి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని బీజేపీ నేత‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. అందులో భాగంగా సోము వీర్రాజును(Somu Veerraju) తొల‌గిస్తున్నార‌ని ప‌లుమార్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, కార్యరూపం మాత్రం దాల్చ‌లేదు. దానికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాబీయింగ్ అనే విష‌యం కూడా వినిపిస్తోంది.

Also Read : AP BJP : రాజ‌ధాని ప్రాంతంలో బీజేపీ నేత సత్య‌కుమార్‌పై దాడి.. తీవ్రంగా ఖండించిన బీజేపీ

ఇక కొడాలి నానిని అరెస్ట్ చేస్తామంటూ అధికారానికి ముడిపెట్టారు. ఏపీలో బీజేపీ (AP BJP) అధికారంలోకి రావ‌డం ఒక క‌ల‌. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఎక్క‌డా రావ‌ని అంద‌రికీ తెలిసిందే. అంటే, కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావును జైలు పంపించాలి అనే డిమాండ్ నెర‌వేర‌ద‌న్న‌మాట‌. వాస్త‌వంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాసినో సంద‌ర్భంగా మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిందని స‌ర్వ‌త్తా వినిపించిన ఆరోప‌ణ‌. దాని మీద కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా విచార‌ణ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ మేర‌కు ఫిర్యాదు కూడా బీజేపీ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, మౌఖికంగా మాజీ మంత్రి కొడాలి మీద మాట్లాడ‌డం ద్వారా వైసీపీ, బీజేపీ దూరం అనే సంకేతం ఇచ్చే ప్ర‌య‌త్నం సునీల్(Sunil deodhar) చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : AP BJP : రెండోసారి బీజేపీ ఏపీ చీఫ్ గా సోము, జ‌న‌సేన‌లోకి `క‌న్నా`? బీజేపీ ఖాళీ!