AP Assembly : మూడో రోజూ టీడీపీ స‌భ్యుల బ‌హిష్క‌ర‌ణ‌

`జ‌గ‌న్ రైతులు ద్రోహి, చంద్ర‌బాబు 420` నినాదాల‌తో ఏపీ అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లింది. ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ నినాదాల‌తో స‌భ అదుపుత‌ప్పింది.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 04:14 PM IST

`జ‌గ‌న్ రైతులు ద్రోహి, చంద్ర‌బాబు 420` నినాదాల‌తో ఏపీ అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లింది. ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ నినాదాల‌తో స‌భ అదుపుత‌ప్పింది. స్పీక‌ర్ పోడియంను టీడీపీ స‌భ్యులు చుట్టుముట్టారు. దీంతో వ‌రుసగా మూడో రోజు కూడా టీడీపీ స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌స్సెండ్ చేశారు. అసెంబ్లీ ప్రారంభ‌మైన వెంట‌నే రైతు స‌మ‌స్య‌ల‌పై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చర్చకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ట్టుబ‌ట్టారు. జ‌గ‌న్ రైతు ద్రోహి అని, రైతుల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పోడియంను ముట్టడించారు. మరోవైపు చంద్రబాబు 420 అంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభ్యుల సస్పెన్షన్‌కు సిఫారసు చేయగా, టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.