Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 12:17 AM IST

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని (AP Speaker Tammineni Sitaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల (Sitaram has Disqualified 8 MLAs )పై అనర్హత వేటు వేశారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో తెలియంది కాదు..ఎన్నికల గడువు దగ్గరికి వస్తున్న కొద్దీ ఏ నేత ఏ పార్టీ లో చేరుతున్నారో..ఏ పార్టీ నేతలతో రహస్యంగా భేటీ అవుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వరుసపెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలలో వలసల పర్వం కొనసాగుతుంది. ఉదయం ఓ పార్టీ లో , రాత్రి ఓ పార్టీ లో చేరుతూ..కార్యకర్తలను , పార్టీ అధిష్టానాలను అయోమయానికి గురి చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇలాంటి ఈ తరుణంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ లో పడేసింది. వైసీపీ చేసిన పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి పేర్లు ఉండగా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ (Mekapati Chandrashekhar Reddy, Undavalli Sridevi, Karanam Balaram, Maddala Giri, Vallabhaneni Vamsi, Kotam Reddy Sridhar, Anam Narayan Reddy and Vasupally Ganesh) పేర్లు ఉన్నాయి. ఇలా రెండు పార్టీలలో సమానంగా నేతలు ఉండడం తో ఏ పార్టీ కి సపోర్ట్ చేయకుండా ఇరుపార్టీలకు చెందిన మెుత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు. స్పీకరు తీసుకున్న ఈ నిర్ణయం ఏ పార్టీకి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also : Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..