AP Assembly sessions : జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 09:15 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాల (AP Assembly Sessions) తేదీలు ఫిక్స్ చేసారు. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. 24న ప్రొటెం స్పీకర్‌ని ఎన్నుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ప్రొటెం స్పీకర్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలతో భారీ విజయం సాధించింది. ఇక వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇక జనసేన పార్టీనే ప్రతిపక్ష హోదాలో నిలువబోతుంది. ఇక అసెంబ్లీ సమావేశాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. కొత్తగా అసెంబ్లీ లో అడుగుపెట్టేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీ లో అడుగుపెడుతుండడంతో ఆ క్షణాల కోసం అంత ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ లో పవన్ ప్రమాణ స్వీకారం చూడాలని పార్టీ శ్రేణులు , అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేడని వైసీపీ నేతలు చేసిన విమర్శలకు పవన్ 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి పవన్ లెక్క ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఇక అసెంబ్లీ లో గత ప్రభుత్వ లెక్కలు ఎలా తెలుస్తాడో చూడాలి.

Read Also : IPS Transfers : తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ