ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకాన్నాయి. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న ఈ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని అధిష్టానం నిర్ణయించింది. తొలుత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని భావించినప్పటికీ ప్రజా సమస్యలు, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై అసెంబ్లీలోనే కొట్లాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేలకు తెలిపారు. దీంతో టీడీఎల్పీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నారు. ఉదయం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు నివాళ్లు అర్పించనున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్యేలో అసెంబ్లీలో, బయట ఆందోళన చేయనున్నారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అక్రమాలు, దౌర్జన్యాలను బట్టబయలు చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికార వైఎస్సార్‌సీపీ సర్వసన్నద్ధంగా ఉంది. సెషన్ మొదటి రోజు అధికార పార్టీ నేతలు టీడీపీ చేసిన అవినీతిపై ఘాటుగా స్పందించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు.
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఐదు రోజుల పాటు కొనసాగే ఛాన్స్..?

AP ASSEMBLY