నవంబర్ 11 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజున ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే పూర్తి స్థాయి బడ్జెట్ (ap full budget) ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈసారి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలనుకుంటున్నారు.
ఈ సమావేశాలలో బడ్జెట్ తో పాటు ఇతర బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలవుతుందని భావించినా దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, కర్ణాటక మరియు తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలను పరిశీలించి నివేదికలు సమర్పించారు.
ఇక గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది, మొత్తం రూ. 2,86,389 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024 ఏప్రిల్ నుండి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి రూ. 1,90,052.34 కోట్లకు 40 గ్రాంట్ల కింద గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం పొందింది. ఆ తరువాత, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల, కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం పొందింది. అయితే, నవంబర్ వరకు నాలుగు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం పొందింది. ప్రస్తుతం ఈ గడువు ముగుస్తుండటంతో, కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతోంది.
Read Also : Ishan Kishan: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇషాన్ కిషన్!