Ap Assembly : రెండో రోజు కూడా అదే గందరగోళం..విజిల్ వేస్తూ హల్చల్ చేసిన బాలకృష్ణ

రాంబాబు మాట్లాడుతుండగా..బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో సభలో వీడియో తీసినందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ ను స్పీకర్ సస్పెండ్ చేసారు

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 10:22 AM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా అదే గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. నిన్న గురువారం ఎలాగైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ(TDP) నేతలంతా నిరసనలు తెలిపారో..రెండో రోజు అదే మాదిరిగా నిరసనలు తెలిపారు. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని, ఆయన్ని విడుదల చేయాలంటూ సభా వేదికగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు, టీడీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati rambabu).. టీడీపీ నేతల ఆందోళనపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని , దమ్ముంటే చర్చకు రమ్మని సవాల్ విసిరారు. ప్రాపర్ ఫార్మెట్ లో‌ వస్తే అసెంబ్లీలో చర్చించడానికి సిద్దంగా వున్నామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో బాలకృష్ణ (MLA Balakrishna) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

Read Also : Share Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

మీ తండ్రి వెన్నులో కత్తి దిగిన సంగతి గుర్తు తెచ్చుకో. బాలయ్యకు ఇది మంచి అవకాశం. ఎన్టీఆర్ కుమారులు తండ్రికి ద్రోహం చేశారానే అపవాదు ఉంది. ఇప్పుడు దానిని తుడిచేసే ఛాన్స్ వచ్చింది. పార్టీ పగ్గాలు మీరే తీసుకోండి. మీ ప్రతాపం చూపించండి. మీ మీద పడిన మచ్చను తొలగించుకోండి. మీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోండి. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చలో పాల్గొనండి. మీ వాదనలను సభలో చెప్పుకోండి. శాసనసభలో నియమనిబంధనలు పాటించకపోతే, తప్పుచ చేస్తే యాక్షన్ ఉంటుంది. టీడీపీ సభ్యులు రాగానే గందరగోళం చేస్తున్నారు.’ అంటూ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబాబు మాట్లాడుతుండగా..బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో సభలో వీడియో తీసినందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ ను స్పీకర్ సస్పెండ్ చేసారు. సమావేశాలు ముగిసేంత వరకు వీరు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.