AP Assembly Session : ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ.. ‘మాక్ ‘ దిశగా టీడీపీ

ఏపీ రాజకీయం హీటెక్కిన ప్రస్తుత సమయంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్దం అయింది. ఈ నెల 18 వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలను పెట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు టీడీపీ హాజరు అవుతుందా? గతంలో మాదిరిగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 03:52 PM IST

ఏపీ రాజకీయం హీటెక్కిన ప్రస్తుత సమయంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్దం అయింది. ఈ నెల 18 వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలను పెట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు టీడీపీ హాజరు అవుతుందా? గతంలో మాదిరిగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అరెస్టులు, కార్యకర్తల మీద దాడులకు నిరసనగా గత అసెంబ్లీ సమావేశాల్లో మాక్ అసెంబ్లీ కి టీడీపీ పరిమితం అయింది. ఈ సారి ఎలాగైనా టీడీపీ ని సమావేశాలకు వచ్చేలా చేయాలని జగన్ ప్లాన్ చేసాడని తెలుస్తుంది. అసెంబ్లీ వేదిక గా అనేక విషయాలు ప్రస్తావించి చంద్రబాబు ను టార్గెట్ చేయాలని దిశానిర్దేశం చేసినట్టు వైసీపీ వర్గాల్లో టాక్. బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్న టీడీపీని ఈసారి అసెంబ్లీ లో నిలదీయాలని ప్లాన్ చేశారట. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి పై చర్చకు టీడీపీ ని అసెంబ్లీ లో ఉంచాలని భావిస్తున్నారట. అక్కడే ప్రజలకు వాస్తవాలను చెప్పాలని జగన్ నిర్ణయించాడని తెలుస్తుంది.
ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సభలో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. మూడు రాజధానులపైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.18వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కంటే ఒకరోజు ముందు మంత్రివర్గం సమావేశమౌతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇదివరకు 17వ తేదీ నుంచి అసెంబ్లీని సమావేశ పర్చాలని భావించిన విషయం తెలిసిందే. 17వ తేదీన మంత్రివర్గ భేటీని నిర్వహించి.. ఆ మరుసటి రోజే అసెంబ్లీని సమావేశ పర్చాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌

శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టదలిచిన పలు ముసాయిదా తీర్మానాలను మంత్రివర్గం ఆమోదిస్తుంది. రాష్ట్ర భవిష్యత్‌తో ముడిపడి ఉన్న కొన్ని కీలక బిల్లులను ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి అధికార పార్టీ రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే- పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలును తీర్చిదిద్దే విషయంలో ఇక ఎంత మాత్రం కూడా జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న మంత్రివర్గానికి ఇదే చివరి భేటీ అవుతుందని వినికిడి. ఎందుకంటే, ఈ సారి మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చుతారని టాక్. అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ రోజైన మంత్రి వర్గాన్ని మార్పు చేసే అవకాశం ఉంది.అంతేకాదు, కొత్త మంత్రి వర్గం తో విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తం పెట్టారని తెలుస్తుంది. అందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర కు శ్రీకారం చుట్టారని వినికిడి. సో …అసెంబ్లీ లోపల..బయట ఈసారి మళ్ళీ మూడు రాజధానులు అంశం రెచ్చకెక్కనుంది. ఇలాంటి కీలక సమావేశాలకు టీడీపీ హాజరు అవుతుందా? దూరంగా ఉంటుందా? అనేది ఆసక్తికర అంశం.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు