Site icon HashtagU Telugu

Ramacharyulu : ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు రాజీనామా

AP Assembly Secretary General Ramacharyulu resigned

AP Assembly Secretary General Ramacharyulu resigned

Ramacharyulu Resigned: ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తన పంపారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ చానళ్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైలు సిద్ధం చేయడంలోనూ రామాచార్యులు వ్యవహరించి తీరు చర్చనీయాంశం అయింది. అయ్యన్న స్పీకర్ హోదాలో తొలి సంతకం చేసే ఫైలు విషయంలో రామాచార్యులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని, ఆ మూడు చానళ్లపై నిషేధం ఎత్తివేత అంశాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, గత ప్రభుత్వ హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. వాస్తవానికి ఆయన రిటైర్ అయ్యారు. అయిన కూడా గత సర్కార్‌ అతనిని కొనసాగించింది. రిటైర్ అయిన తర్వాత కొనసాగుతోన్న అధికారులు రాజీనామా చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీంతోపాటు అసెంబ్లీ నిర్వహణలో రామాచార్యుల వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. అతని తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహాంతో ఉన్నారు. రాజీనామా చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రామాచార్యులు రాజీనామా చేశారు. తన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోసెన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు.

Read Also: Anant Ambani Wedding : అనంత్ అంబానీ పెళ్లి భోజనాల మెనూ ఇదీ..

మరోవైపు ఏపి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. హేమంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read Also: Kitchen Tips : ఫుల్ బెనిఫిట్.. కిచెన్‌లో ఈ పొరపాట్లు చేయొద్దు..