AP assembly : ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
AP assembly meetings from February 24

AP assembly meetings from February 24

AP assembly : ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 15 పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !

కాగా, కేంద్ర బడ్జెట్‌ 2025-26ను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌ 2025-26పై కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలను తెచ్చుకొని బడ్జెట్‌ రూపకల్పనపై దృష్టిసారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్‌ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చిన కూటమి సర్కార్‌.. ఓటాన్ అకౌంట్‌తోనే నెట్టుకొచ్చిన ప్రభుత్వం.. మరోసారి నవంబర్‌లో అదే ఫాలో అయిపోయింది. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది.

మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా, రారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన రాకండా మిగతా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా అనే దానిపైనా క్లారిటీ లేదు. ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Drone: ఆ డ్రోన్‌లతో డీల్‌ను రద్దు చేసిన భారత్..

  Last Updated: 07 Feb 2025, 05:38 PM IST