AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు

  • Written By:
  • Updated On - February 1, 2024 / 03:45 PM IST

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో వైసీపీ ప్రభుత్వాని(YCP Govt)కి ఈ అసెంబ్లీ స‌మావేశాలే చివ‌రి స‌మావేశాలు కానున్నాయి. మ‌ళ్లీ కొత్త స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 6న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఎన్నికలకు ముందు జరిగే, ప్రభుత్వానికి ఇదే చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. ముఖ్యమై నిర్ణయాలను, పథకాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించే అవకాశముందని తెలిసింది.  ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

Also Read: LS Tickets: లోక్ సభ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్స్, పోటాపోటీగా లాబీయింగ్!