AP Assembly :TDP,YCP`బ్లాక్ డే`వార్‌!`ట్విట్ట‌ర్`డీపీల ఛేంజ్!!

సోషల్ మీడియా రాజ‌కీయాల్లో (AP Assembly) సింహ‌భాగంగా నిలుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 02:57 PM IST

సోషల్ మీడియా రాజ‌కీయాల్లో (AP Assembly) సింహ‌భాగంగా నిలుస్తోంది. `బ్లాక్ డే`(Black Day) డీపీల‌తో పోటీప‌డి టీడీపీ, వైసీపీ నిర‌స‌న‌కు దిగాయి. ఏపీ అసెంబ్లీలో జరిగిన ప‌ర‌స్ప‌ర కొట్లాట ప్ర‌పంచానికి తెలిసేలా ట్విట్ట‌ర్ అకౌంట్ల డీపీల‌ను. `బ్లాక్ డే` సిక్క‌ర్ల‌తో మార్చేశారు. క్యాడ‌ర్ కు ఇరు పార్టీలు పిలుపునిస్తూ డీపీలు మార్చ‌డం ద్వారా నిర‌స‌న పెద్ద ఎత్తున తెలియ‌చేయాల‌ని దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం.

`బ్లాక్ డే` డీపీల‌తో  టీడీపీ, వైసీపీ నిర‌స‌న‌ (AP Assembly)

సాధార‌ణంగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం (AP Assembly) అరుదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగ‌డం, చేయి చేసుకోవ‌డం దిగ‌జారుడుత‌నం. ఇలాంటి సంద‌ర్భాల్లో అసెంబ్లీ రికార్డులు, వీడియో ఫీడ్ ల‌ను య‌థాత‌దంగా ఎథిక్స్ క‌మిటీ (Black Day)ముందు ఉంచుతారు. త‌ప్పు ఎవ‌రితో తేల్చుతారు. స‌భ‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పేలా చేస్తారు. మ‌రోసారి ఇలాంటి సంఘ‌ట‌న పున‌రావృతం కాకుండా స్పీక‌ర్ చేయాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ విధంగా జ‌ర‌గ‌డంలేద‌ని ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా వినిపించ‌డం ప‌త‌నావ‌స్థ‌కు వెళ్లిన రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నం.

ఎడిట్ చేయ‌కుండా ఫుటేజ్ ను ప‌రిశీలించాల‌ని

రాజ్యాంగం ప్ర‌కారం అసెంబ్లీ ప్రాంగ‌ణం అంతా స్పీక‌ర్( AP Assembly) ప‌రిధిలోనే ఉంటుంది. స‌భ‌ను కంట్రోల్ చేయ‌డానికి కొన్ని విశిష్ట అధికారాలు కూడా ఉంటాయి. స‌భ లోప‌ల‌, ఆవ‌ర‌ణ‌లోనూ ఆయ‌నే సుప్రీం. ఇప్పుడు వీడియో ఫుటేజ్ ను బ‌య‌ట పెట్టాల్సిన బాధ్య‌త కూడా ఆయ‌న‌దే. ఎడిట్ చేయ‌కుండా ఫుటేజ్ ను ప‌రిశీలించాల‌ని, దాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని టీడీపీ చేస్తోన్న డిమాండ్‌. త‌ప్పు అధికార పార్టీద‌ని ప్ర‌తిప‌క్షం, కాదు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల తీరు బాగాలేద‌ని అధికార‌ప‌క్షం సవాళ్లు, ప్రతి సవాళ్లు (Black Day)విసురుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుండగా దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.

వైసీపీ ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చారు (Blac Day)

వైసీపీ ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చారు. ‘బ్లాక్ డే’(Black Day) అని ఉన్న ఫొటో పెట్టారు. ‘అసెంబ్లీ (AP Assembly)సాక్షిగా వైఎస్సార్ సీపీ కి చెందిన‌ దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై దాడి చేసిన టీడీపీ నేతలు’ అని పేర్కొన్నారు. మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, తదితరులు కూడా ఇదే డీపీని పెట్టడం గమనార్హం.

Also Read : AP Assembly : ఏపీ అంసెంబ్లీలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..?

ఏపీ అసెంబ్లీలో (AP Assembly)సోమ‌వారం అనూహ్య సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బెందాళం అశోక్, ఏలూరి సాంబశివరావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే సభలో జరిగిన ఘటన సన్నివేశాలను ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని సవాల్ విసిరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును పక్కదోవ పట్టించేందుకే  ప్లాన్ (AP Assembly)

బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ తనపై వైసీపీ ఎమ్మెల్యేలు (AP Assembly) సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని చెప్పారు. స్పీకర్ పోడియం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడికి పాల్పడ్డారని అన్నారు. శాసనసభను కౌరవసభగా మార్చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసి… తామే వారిపై దాడి చేసినట్టు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆవేద‌న చెందారు. స్పీకర్ పై తాను అనుచితంగా ప్రవర్తించినట్టైతే తనకు ఏ శిక్ష విధించినా కట్టుబడి ఉంటానని వెల్ల‌డించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును పక్కదోవ పట్టించేందుకే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తనపై దాడి చేశారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ప‌ర‌స్ప‌రం మీడియా వేదికగా స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకుంటూ మ‌రో వైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా(Black Day) డీపీల‌ను మార్చుతూ వార్ కు దిగారు. మొత్తం మీద ఏపీ ప‌రువును పోటీప‌డి మంట‌క‌లుపుతున్నారు.

Also Read : Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్