Site icon HashtagU Telugu

Assembly Budget Meetings: మార్చి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP CM

Resizeimagesize (1280 X 720) 11zon

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు (Assembly Budget Meetings) తేదీలను ప్రభుత్వం ఖారారు చేసింది. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం పదమూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయి బడ్జెట్ ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ అధికార పార్టీకి కీలకంగా మారనుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుకునే అవకాశముందని తెలిసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అమరావతి ప్రాంతంలో 144వ సెక్షన్ విధిస్తున్నారు.

Also Read: Ex-President Husband: భారత మాజీ రాష్ట్రపతి భర్త కన్నుమూత