AP Assembly: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్

బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై పలు రాష్ట్రాలు తమ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2021 / 12:19 AM IST

బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై పలు రాష్ట్రాలు తమ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ బీసీ గణన కోరుతూ ఓ తీర్మానం చేసి ఆమోదించి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగాఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మాణాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది.

ఈ తీర్మాణం సందర్భంగా జరిగిన చర్చలో సీఎం జగన్ పలు సీరియస్ కామెంట్స్ చేశారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని,బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ ప్రకటించారు. బీసీ జనాభా విషయంలో స్పష్టత లేదని,విద్య, ఉద్యోగాలు, రాజకీయపరంగా బీసీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వివక్షతకు గురవుతున్నామనే అభిప్రాయం కూడా బీసీల్లో ఉందని కులగణన చేస్తేనే వారికి ఎలాంటి పధకాలు చేపట్టాలనే క్లారిటీ వస్తుందని జగన్ తెలిపారు.
త్వరలో జరగబోయే జనాభా లెక్కల్లో కులాల వివరాలు నమోదు చేసి డేటాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల జనాభా లెక్కిస్తే బావుంటుందని కొన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రాష్ట్రస్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానమంటూ ఏదీ లేకపోవడంతో కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు.

బీసీ కుల గణన అంటే

దేశవ్యాప్తంగా ఉన్న జనాభాను పదేళ్లకోసారి లెక్కిస్తారు. ఈ సంవత్సరం కూడా కేంద్రం దేశ జనాభాను లెక్కిస్తోంది. దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా కేంద్రం విడుదల చేసింది.
అయితే బీసీ కులాల లెక్కను ప్రత్యేకంగా లెక్కించాలని పలు బీసీ సంఘాల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు.
బీసీ కులాల గణన చేపడితే మిగతా కులాలు కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తీసుకురావొచ్చనే ఆందోళనతో కేంద్రం ఈ డిమాండ్లను పక్కన పెడుతోంది.