AP Assembly : నోరుజారిన స్పీక‌ర్! టీడీపీ స‌భ్యుల స‌స్సెండ్ !!

AP Assembly : ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు స్పీక‌ర్ స్థానాన్ని ప్ర‌శ్నిస్తోంది. ఒక స‌భ్యుడ్ని `యూస్ లెస్ ఫెలో` అంటూ అనుచిత వ్యాఖ్య చేయ‌డం

  • Written By:
  • Updated On - September 21, 2023 / 02:47 PM IST

AP Assembly : ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు స్పీక‌ర్ స్థానాన్ని ప్ర‌శ్నిస్తోంది. ఒక స‌భ్యుడ్ని `యూస్ లెస్ ఫెలో` అంటూ అనుచిత వ్యాఖ్య చేయ‌డం ఆయ‌న వాల‌కాన్ని తెలియ‌చేస్తోంది. గతంలోనూ స్పీక‌ర్ స్థానంలో వివాద‌స్ప‌దంగా వ్య‌వ‌హ‌రించారు. అసెంబ్లీ బ‌య‌ట ఒక రాజ‌కీయ నాయ‌కుని మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీకి సంపూర్ణంగా మ‌ద్ధ‌తు ప‌లుకుతూ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. తాజాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు మీద టీడీపీ మండిప‌డుతోంది.

స‌భ్యుడ్ని `యూస్ లెస్ ఫెలో` అంటూ అనుచిత వ్యాఖ్య (AP Assembly) 

ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబును అరెస్ట్ చేసి, జైలులో పెట్ట‌డంపై (AP Assembly) చ‌ర్చ జ‌ర‌గాల‌ని టీడీపీ వాయిదా తీర్మానం పెట్టింది. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో టీడీపీ స‌భ్యులు పోడియంను చుట్టుముట్టారు. చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని కోరుతూ నిన‌దించారు. దీంతో స‌భను వాయిదా వేయ‌డం జ‌రిగింది. తిరిగి స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే అదే త‌ర‌హా నినాదాల‌ను వినిపిస్తూ పోడియంను చుట్టుముట్టారు.ఆయ‌న ముందున్న బ‌ల్ల‌ను చ‌రిచారు. దీంతో స‌భ‌లోని వైసీపీ స‌భ్యులు వార్నింగ్ లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌తిగా బాల‌క్రిష్ణ మీసం మెలేస్తూ ద‌మ్ముంటే చూసుకుందాం..అంటూ గ‌ర్జించారు. దీంతో బియ్యం మ‌ధుసూద‌న్ రెడ్డి తొడ‌గొడుతూ రెచ్చ‌గొట్టారు.

టీడీపీ స‌భ్యుల‌ను ఒక రోజు బ‌హిష్క‌రిస్తూ

స‌భ గంద‌ర‌గోళంగా మార‌డంతో టీడీపీ స‌భ్యుల‌ను (AP Assembly) సస్సెండ్ చేస్తూ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి తీర్మానించారు. ఆ మేర‌కు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్సెండ్ చేస్తూ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఈ సెష‌న్ జ‌రిగిన‌న్ని రోజులు వైసీపీ రెబ‌ల్ కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి, టీడీపీ స‌భ్యులు అనగాని, పయ్యావులపై స‌స్పెష‌న్ వేటు ప‌డింది. మిగిలిన స‌భ్యుల‌ను ఒక రోజు బ‌హిష్క‌రిస్తూ స్పీక‌ర్ వెల్ల‌డించారు. ఆ త‌రువాత మీడియా ముందుకొచ్చిన టీడీపీ స‌భ్యులు అసెంబ్లీలోని ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఏక‌ప‌క్షంగా స‌భ‌ను నిర్వ‌హించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్షం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

త‌మ్మినేని వైసీపీ పార్టీ లీడ‌ర్ గా

సాధార‌ణంగా స్పీక‌ర్ స్థానంలో ఉన్న వాళ్లు పార్టీల ప‌రంగా ఉండ‌రు. ఒక వేళ పార్టీ ప‌రంగా స‌భ్య‌త్వం ఉన్న‌ప్ప‌టికీ ఉప‌సంహ‌రించుకుంటారు. కానీ, త‌మ్మినేని మాత్రం వైసీపీ పార్టీ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీ బ‌య‌ట జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజరు అవుతున్నారు. టీడీపీ మీద ఎప్ప‌టికప్పుడు దుమ్మెత్తిపోస్తూ స్పీక‌ర్ (AP Assembly) స్థానానికి ఉన్న హుందాత‌నంను లేకుండా చేస్తున్నార‌ని విప‌క్షాలు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ద్ధ‌తిలో ఏ మాత్రం మార్పు లేక‌పోవ‌డాన్ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

Also Read : Jagan in Trouble : చంద్రబాబుకు సానుభూతి వెల్లువ‌, సీ ఓట‌ర్ స‌ర్వే తేల్చివేత‌

ఆధారాల్లేని కేసులో చంద్ర‌బాబును అరెస్ట్ చేసి కోర్టుకు పంపార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. జైలుకు పంప‌డంపై చ‌ర్చ‌కు సిద్ధం కావాల‌ని అధికార‌ప‌క్షంకు స‌వాల్ చేసింది. కానీ, స్కిల్ ప‌థ‌కం గురించి చర్చ సాగిద్దామంటూ వైసీపీ ప్ర‌తివాద‌న‌కు దిగింది. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య హోరాహోరీగా వాద‌ప్ర‌తివాద‌న‌ల‌ను జ‌ర‌గ‌డం అసెంబ్లీలో గంద‌ర‌గోళానికి తెర‌లేచింది. ఇలాంటి సీన్ మండ‌లిలోనూ కొన‌సాగింది. తొలి రోజు అసెంబ్లీకి పాద‌యాత్ర‌గా వెళ్లిన టీడీపీ ఇదే త‌ర‌హాలో అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తే శాశ్వ‌తంగా బాయ్ కాట్ చేస్తూ ప్ర‌జాక్షేత్రంలోకి ఎమ్మెల్యేలు వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Prisoner Death: రాజమండ్రి జైల్ లో ఖైదీ మృతి, బాబు భద్రతపై టీడీపీ ఆందోళన