Site icon HashtagU Telugu

Maritime Hub : మారిటైమ్ హబ్ గా ఏపీ – చంద్రబాబు

Ap Maritime Hub

Ap Maritime Hub

రాష్ట్రాన్ని ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్ (Maritime Hub) గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని… పెట్టుబడులు, మౌలిక సదుపాయల శాఖను ముఖ్యమంత్రి (CM Chandrababu) ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ-2024పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోర్టులతో పాటు సమీప ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. నౌకా నిర్మాణానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు.

తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఇసుక డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాలని ఆదేశించారు. ఇసుక లభ్యతపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక ధరల్ని కంట్రోల్ చేసేందుకు జిల్లా స్థాయిలో ధరలను మరల సమీక్షించాలని ఆదేశించారు. ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే కస్టమర్ల నుంచి వసూలు చేయాల్సిందిగా తెలిపారు. ఈ అంశంలో ఫిర్యాదులు వస్తే సహించబోమన్నారు. ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాలన్నారు.

Read Also : Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే ప‌గ్గాలు అని చెప్పే కార‌ణాలివే!

Exit mobile version