Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబుని క‌లిసిన అనంత‌పురం ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌కాష్‌.. ప్రాణ భ‌యం ఉందంటూ..?

TDP

TDP

రాష్ట్ర పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తూ..కొద్దిరోజుల క్రితం సర్వీస్ నుంచి తొలగించబడిన అనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పోలీసు శాఖలో సమస్యలు, పెండింగ్ నిధుల విడుదలపై ప్ల కార్డు పట్టుకున్న తనను ప్రభుత్వం ఎలా వేధిస్తోందో వివరించారు. తనను అక్రమ కేసులో ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా….ఇప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ప్రకాష్ తెలిపారు. తనకు ప్రాణభయం ఉందని….అండగా నిలవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును కోరారు. ప్రకాష్ తో పాటు గార్లదిన్నె కు చెందిన ల‌క్ష్మీ కూడా చంద్రబాబును కలిశారు. తన భర్త విషయంలో తాను పోలీసులను ఆశ్రయించగా…ఆ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించి ప్రకాష్ ను డిస్మిస్ చేశారని ఆమె తెలిపింది. తాను ప్రకాష్ కు ఎటువంటి డబ్బు బంగారం ఇవ్వలేదని, తనను ప్రకాష్ ఎక్కడా వేధించలేదని లక్ష్మీ తెలిపింది. ఇదే విషయం తాను మీడియాలో చెప్పిన తరవాత తనపైనా వేధింపులు తీవ్రం అయ్యాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను న్యాయపోరాటం చేయ‌డానికి సిద్దంగా ఉన్నానని….తమకు అండగా నిలవాలి అని ప్రకాష్ టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. ధైర్యంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీగా తాము అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు.

Exit mobile version