AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..

గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ తరుణంలో రేపటి నుండి ఎమ్మెల్యే (YCP MLAS) ల ఇంటి వద్ద నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 15 రోజులుగా అంగన్వాడీలు వినూత్న పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు […]

Published By: HashtagU Telugu Desk
Anganwadi Workers

Anganwadi Workers

గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ తరుణంలో రేపటి నుండి ఎమ్మెల్యే (YCP MLAS) ల ఇంటి వద్ద నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే 15 రోజులుగా అంగన్వాడీలు వినూత్న పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు పెంచి గ్రాడ్యూటీని కూడా అమలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తమకు కనీస వేతనం తమ డిమాండ్‌ను అంగీకరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అందుకే పళ్లాలు వాయిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి మాట తప్పారు కాబట్టి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘అంగన్‌వాడీలు నా అక్కాచెల్లెళ్లు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తాను. తెలంగాణ కన్నా.. రూ.వెయ్యి అదనంగా వేతనం అందజేస్తామ’ని ప్రకటించిన సీఎం జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపించారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అక్కాచెల్లెళ్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని వారంతా ప్రశ్నింస్తున్నారు. మరి రేపటి నుండి ఎమ్మెల్యేల ఇంటివద్ద నిరసన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయో చూడాలి.

Read Also : Praja Palana : ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు – మంత్రి పొంగులేటి

  Last Updated: 26 Dec 2023, 09:17 PM IST