ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్ననేపథ్యంలో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. వర్షాలతోపాటు వాతావరణం కూడా మరింత చల్లగా మారుతుందన్నారు.
ఈ వాయుగుండం రానున్న 48 గంటల్లోఏపీ తీరానికి దగ్గరగా రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చేపలవేటకు వెళ్లే వారు సముద్రంలోకి వెళ్లద్దని హెచ్చరించింది. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.