AP @ $243 : 2027నాటికి AP 20ల‌క్ష‌ల కోట్లకు..అమ‌రావ‌తితో భేషుగ్గా.!SBI నివేదిక‌ !!

AP @ $243: ఏపీ ఆర్థిక ఒడిదుడుకుల‌కు కార‌ణం రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్టు కూలడం.ఆ ప్రాజెక్టు కొన‌సాగిఉంటే మెరుగ్గా ఉండేద‌ని ఎస్బీఐ తేల్చింది.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 05:08 PM IST

AP @ $243: ఏపీ ఆర్థిక ఒడిదుడుకుల‌కు ప్ర‌ధాన కార‌ణం రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూలడం. ఆ ప్రాజెక్టు కొన‌సాగి ఉంటే రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత మెరుగ్గా ఉండేద‌ని ఎస్బీఐ ప‌రిశోధ‌న నివేదిక తేల్చింది. గ‌త కొన్నేళ్లుగా రికార్డ్ స్థాయిలో వృద్ధి రేటును చూపుతోన్న రాష్ట్రంగా నివేదిక పొందుప‌రిచింది. అమ‌రావ‌తి ప్రాజెక్టు ఉంటే మ‌రింత మెరుగ్గా వృద్ధి రేటు ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం ఆర్థిక క‌ష్టాల‌కు ప్ర‌ధాన కార‌ణంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూల‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌న తేల్చింది. అయిన‌ప్ప‌టికీ 2027 నాటికి 20ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక పరిపుష్టిని (AP @ $243)క‌లిగి ఉంటుంద‌ని నివేదిక అంచ‌నా వేసింది.

2027 నాటికి 20ల‌క్ష‌ల కోట్లుకు ఏపీ (AP @ $243)

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి రాబోయే మెరుగ్గా ఉంటుంద‌ని ఎస్బీఐ ఎకో ర్యాప్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్ర‌కారం 2027 నాటికి 20ల‌క్ష‌ల కోట్లుకు (AP @ $243)చేరుకుంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఇథియోపియా దేశానికి స‌మానంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఏపీ క‌లిగి ఉంటుంద‌ని ఆ నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. ఆఫ్రికా దేశాల్లో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా క‌నిపిస్తోన్న ఇథియోపియో తో స‌మానం ఏపీ ఉంటుంద‌ని ఎస్బీఐ ఎకో ర్యాప్ ( Ecowrap) అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

భార‌త దేశంలోని మొత్తం జీడీపీలో 5శాతం వాటా ఏపీది

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా 243-బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 20-లక్షల కోట్లు)ఎదుగుతుంద‌ని అంచనా వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అక్క‌డ వ‌న‌రులు, మౌలిక స‌దుపాయాలు, రాజ‌కీయ, సామాజిక ప‌రిస్థితులు అన్నింటినీ బేరేజు వేసిన త‌రువాత 20కోట్ల‌కు ప‌రిమాణానికి ఏపీ ఆర్థికం చేరుకుంటుంద‌ని అంచ‌నా వేయ‌డం స‌గ‌టు ఆంధ్రుడికి ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. ఈనెల 27న విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉండ‌బోతుంది. భార‌త దేశంలోని మొత్తం జీడీపీలో 5శాతం వాటా ఏపీది ఉంటుంద‌ని చెబుతోంది. 2027 నాటికి దేశంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏపీ  (AP @ $243) ఉంటుంద‌ని SBI పరిశోధన నివేదిక తేల్చేసింది.

2022-23లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2.19 లక్షలు

ప్ర‌పంచ వ్యాప్తంగా భారతదేశం 2027 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంద‌ని అంచ‌నా వేసింది. గ‌తంలో వేసిన అంచ‌నా ప్ర‌కారం 2029 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ఉంటుంది. కానీ, రెండేళ్ల ముందుగానే భార‌త్ ఆ ల‌క్ష్యాన్ని చేరుకుంటుంద‌ని తాజాగా ఎస్పీఐ ప‌రిశోధ‌న‌లో తేల్చేసింది. ఏపీ గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం(2022-23) లో 16% వృద్ధి రేటును నమోదు చేసింది. గత ఆరేళ్లలో ఏపీ రాష్ట్రం ఐదుసార్లు 10% వృద్ధి రేటును నమోదు చేసింద‌ని ఎస్పీఐ ప‌రిశోధ‌నలో(AP @ $243) తేలిన అంశం. కోవిడ్-19 మొదటి సంవత్సరం మాత్రమే మినహాయింపు (2020-21)లో 5% వృద్ధి రేటు చూపించింద‌ని గుర్తించింది.

Also Read : Amaravathi Capital : సుప్రీంలో జ‌గన్ కు మ‌రో షాక్‌! అమ‌రావ‌తి రాజ‌ధాని పదిలం!!

అదేవిధంగా, 2022-23లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2.19 లక్షలుగా ఉంది. 2021-22లో రూ. 1.92 లక్షలకు వ్యతిరేకంగా, 14% వృద్ధి రేటుకు సాధించి 1.38 లక్షలుగా ఉంది. 2017-18లో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.57,427 కోట్ల నుంచి 2022-23 ఆర్థిక ఏడాదికి రూ.84,389 కోట్లకు పెరిగింది. అదేవిధంగా పన్నుయేతర ఆదాయాలు రెండేళ్లలో దాదాపు రెట్టింపు పెరిగి రూ.6511 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ. 3,395 కోట్లుగా ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విపరీతమైన ఒత్తిడికి లోనైంది. వడ్డీ చెల్లింపులు, సంక్షేమం, స్థాపన వ్యయం మరియు మూలధన నష్టం త‌దిత‌రాల కార‌ణంగా ఇబ్బందులు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌న‌లో గ‌మ‌నించారు.

Also Read : AP Capital : కేసీఆర్ క‌ళ్ల‌లో ఆనందం కోసం జ‌గ‌న్ ! అమ‌రావ‌తి కూల్చివేత‌!!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్టు కూలిపోవ‌డంతో ఆర్థిక ఒత్తిడి ఏర్ప‌డింద‌ని ఆర్బీఐ ప‌రిశోధ‌న నివేదిక తేల్చింది. అంతేకాదు, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స‌హాయం కూడా అనుకున్న రీతిలో రాలేదు. ఫ‌లితంగా రాబడి కంటే ఎక్కువ‌గా హామీలు ఉండ‌డం కార‌ణంగా అనూహ్యంగా వ్య‌వ‌యాలు పెరిగాయ‌ని తేల్చింది. అయిన‌ప్పటికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ ఆర్థికంగా ఎదుగుతుంద‌ని ఆ నివేదిక తేల్చింది.