Site icon HashtagU Telugu

AP Politics: జగన్ పై `రెడ్డి` తిరుగుబాటు? ముహూర్తం కార్తీక సమారాధన

Polavaram

Jagan Imresizer

వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంపై ఏపీ అధికార పార్టీ వైసీపీలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఎందుకు ఇవ్వరు.. అంటూ.. కొంత మంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రజల్లో ఉన్నా.. ప్రజల ఆమోదం ఉంటేనే.. గెలుస్తారని అనుకుంటేనే.. టికెట్ ఇస్తామని పార్టీ అధినేత సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై జూనియర్లు.. ఎలా ఉన్నా.. సీనియర్లు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు.

“పార్టీని ఈ భుజాలపై మోశాం. మీరు ముఖ్యమంత్రి అయ్యేందుకు అప్పులు చేసి ఖర్చు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. సానుకూలత ఉందా.. అనేది..ఎవరూ చెప్పలే రు. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయా? మేం పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్ కోసం.. పనిచేస్తున్నాం. ఎంతో ఖర్చు కూడా చేసుకున్నాం. అయినా.. ఇప్పుడు టికెట్ల విషయంలో ప్రజలే ఆమోదించాలని అనడం సరికాదు.. ఇలా అయితే.. ప్రజల అభిరుచుల మేరకే అయితే..అనేక విషయాల్లో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సాధ్యమేనా?” అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Also Read:   Smart Meters Issue : జగన్ `స్మార్ట్` సాహసం, ఎమ్మెల్యేలకు `మీటర్ల` షాక్ !

ఇక ఇదే విషయంపై సీమ జిల్లాల్లోనూ.. నాయకులు తటపటాయిస్తున్నారు. గెలుపు ఓటములు అనేవి.. ఎవరూ ఊహించేవి కాదు.. అవి ప్రజలే నిర్ణయిస్తారు. ముందు.. అంతా బాగానే ఉందని అనుకున్న నాయకులు చాలా మంది ఓడిపోయారు. అసలు ఈయన గెలుస్తాడా? అని అనుకున్న చోట గెలుపు గుర్రాలు ఎక్కారు. దానిని ఏమంటారు? ఇవి కాదు. పార్టీ కోసం.. సీఎం కోసం.. ఎవరు పనిచేస్తున్నారో.. వారికి టికెట్లు ఇవ్వాల్సిందే.. అని ఒక సామాజిక వర్గం.. నేతలు తీర్మానం చేశారు.

రెడ్డి వర్గం అయితే.. తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరు? అని చర్చించుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. తమకు కాదని.. వేరే వారికి ఇస్తే.. తమ ప్రతాపం చూపించక తప్పదని అంటున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘం ఒక సభను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు హైదరాబాద్లో భేటీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read:  Jagan Attack Case : జగన్ ఇలాఖాలో `కోడి కత్తి` డ్రామా

దీనికి కార్తీక వనభోజనాల సమయాన్ని ముహూర్తంగా నిర్ణయించారని.. వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే.. వైసీపీలో నిరసన గళం బాగానే వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి. అయితే.. నిరసనలకు వివాదాలకు జగన్ లొంగే తత్వం కాదు. సో.. ఈ పరిస్థితి ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.