America: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

బతుకుదెరువు కోసం అమెరికా (America) వెళ్లిన తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడు రోజుల తర్వాత, ఊహించని మరణం సంభవించింది. ఈ నెల 17న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నపల్లికి చెందిన రవికుమార్ మరో 10 మందితో కలిసి అమెరికా వెళ్లాడు.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 08:58 AM IST

బతుకుదెరువు కోసం అమెరికా (America) వెళ్లిన తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడు రోజుల తర్వాత, ఊహించని మరణం సంభవించింది. ఈ నెల 17న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నపల్లికి చెందిన రవికుమార్ మరో 10 మందితో కలిసి అమెరికా వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడే సీమాన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రవికుమార్ విధులు నిర్వహిస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కంటైనర్‌పై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కంపెనీ ప్రతినిధులు గురువారం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయనకు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రవికుమార్ మృతి వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నాలుగు రోజుల క్రితం అమెరికాలో తెలుగు అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జహ్వవి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సీటెల్ ప్రాంతంలో నివసించే జాహ్నవి సోమవారం డెక్స్టర్ అవెన్యూ నార్త్ థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసు వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జాహ్నవి మరణవార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

Also Read: Russian Missiles: ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం.. 11 మంది మృతి

చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్‌కు చెందిన సాయిచరణ్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరిద్దరూ మరో విద్యార్థితో వెళుతుండగా.. నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దేవాన్ష్‌, చరణ్‌లకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.. సాయిచరణ్ చికిత్స పొందుతున్నాడు. ఇలా వరుసగా తెలుగువారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది.