Shock To YCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మ‌రో స‌ర్వే సంస్థ‌..?

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 4, 2024 / 12:00 PM IST

Shock To YCP: ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయితే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నిక‌లు వ‌స్తే టీవీల‌కు, ప‌త్రిక‌ల‌కే కాకుండా స‌ర్వే సంస్థ‌లకు కూడా చేతినిండా ప‌ని ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు, ప్ర‌తిప‌క్ష పార్టీలకు కొన్ని స‌ర్వే సంస్థ‌లు అనుకూలంగా ఉండి ఫ‌లానా పార్టీ ఇన్ని సీట్లు, ఫ‌లానా పార్టీ ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని జోస్యం చెబుతుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ స‌ర్వే సంస్థ విడుద‌ల చేసిన ఫ‌లితాలు వైసీపీకి షాక్ (Shock To YCP) ఇచ్చేలా ఉన్నాయి. ఈ స‌ర్వే సంస్థ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం చూసుకుంటే.. ఏపీలో కూట‌మి అధికారంలోకి రాబోతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీ త‌క్కువ స్థానాల‌కే ప‌రిమిత‌మ‌య్యేలా ఉంది.

తాజాగా ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏప్రిల్ 2024 వరకు చేసిన సర్వే ప్రకారం ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొంది. ఈ సంస్థ విడుద‌ల చేసిన వివ‌రాల ప్ర‌కారం చూసుకుంటే.. తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా గెలుపొందే స్థానాలు 114 అని, ఎడ్జ్‌లో ఉన్న స్థానాలు 36 అని పేర్కొంది. అంతేకాకుండా అధికార పార్టీ వైసీపీ ఖ‌చ్చితంగా గెలుపొందే స్థానాలు- 11 అని, ఎడ్జ్ లో ఉన్న స్థానాలు- 14 అని పేర్కొంది.

Also Read: Nagarjuna : టీడీపీ, వైసీపీ పార్టీలపై నాగార్జున కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్నవి నిజమేనా..?

ఇక ఎంపీ స్థానాల విష‌యానికొస్తే ఇక్క‌డ కూడా కూట‌మికే ఈ సంస్థ ప‌ట్టం క‌ట్టింది. టీడీపీ అలయెన్స్ ఖచ్చితంగా గెలిచేవి – 19, ఎడ్జ్ లో ఉన్న స్థానాలు – 2 అని తెలిపింది. వైఎస్సార్సీపీ ఖచ్చితంగా గెలిచేవి – 2 అని, ఎడ్జ్ లో ఉన్నవి – 2 అని తెలిపింది. అయితే ఈ సంస్థ స‌ర్వే ఫ‌లితాల‌పై ఆంధ్ర ప్ర‌జ‌లు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల ప్ర‌కారం చూసుకుంటే కూట‌మి ఈ సారి అధికారంలోకి రాబోతుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు. ఇక‌పోతే ఏపీలో మే 13వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నిక‌ల అధికారులు పోలింగ్ కోసం అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశారు. మే 13 ఎన్నిక‌ల త‌ర్వాత జూన్ 4వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఇక ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో చూడాలంటే జూన్ 4 వ‌ర‌కు ఆగాల్సిందే.

We’re now on WhatsApp : Click to Join