Site icon HashtagU Telugu

TDP Sabha Stampede: చంద్రబాబు సభలో మళ్ళీ తొక్కిసలాట.. ముగ్గురు మృతి!

CBN Tour

chandrababu naidu sabha stampede

గుంటూరు: Andhra Pradesh గుంటురు చంద్రబాబు స‍భలో జరిగిన తొక్కిసలాటలో మరణించినవారి సంఖ్య మూడుకు చేరింది. సంఘటనా స్థలంలోనే ఓ మహిళ మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మరణించారు. తెలుగుదేశం ప్రవాసాంధ్రుల శాఖ‌ గుంటురు పట్టణంలో సభ ఏర్పాటు చేశారు. అందులో పేద మహిళల కోసం చంద్రన్న సంక్రాంతి కానుక కిట్, వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అతి ఇరుకుగా ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో సభ ఏర్పాటు చేశారు. పది వేల మంది జనం కూడా సరిపోని ఆ స్థలంలో 30 వేల మందిప్రజలను సమీకరించారు. అందులో మెజార్టీ మహిళలే ఉన్నారు.

ఆ సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించి వెళ్ళిపోగానే ఒక్క సారి మహిళలు తోసుకొని ముందుకొచ్చారు. దాంతో ఒక్కసారి గందరగోళం వ్యాపించి అనేక మందిమహిళలు, వృద్దులు కిందపడిపోయారు. జనం పడిపోయినవారిపై నుంచే పరుగులు పెట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. అనేక మంది గాయాలపాలు కాగా వారందనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మరణించారు. మరి కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.