Nandigam Suresh : హమ్మయ్య అనుకునేలోపు నందిగం సురేశ్ కు మరో షాక్

Nandigam Suresh : జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు తాజా కేసులతో మరోసారి జైలు కు వెళ్లడం ఖాయం అని అంత మాట్లాడుకుంటున్నారు

Published By: HashtagU Telugu Desk
Nandigam Suresh

Nandigam Suresh

జైలు జీవితం ముగించుకుని బయటకు వచ్చినప్పటికీ, నందిగం సురేష్ (Nandigam Suresh) వైఖరి మారలేదు. తాజాగా మంగళగిరి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో రాజు (Raju) అనే వ్యక్తిపై దాడి చేసినట్లు ఆరోపణలతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. రాజుకు గాయాలవడంతో మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేక రిమాండ్‌కు తరలిస్తారా అన్నది పోలీసుల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Blood Pressure: బీపీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే చాలు!

రాజధాని అంశంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సురేష్ కీలకంగా సహకరించారన్న ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. చెరుకు తోటలకు నిప్పు పెట్టే చర్యలు, రైతులపై దాడులు వంటి ఘటనలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఆధారాల్లేకపోవడంతో బయటపడ్డారు. ఈ పనులు చేయడంతో జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత ఇసుక సహా ఇతర వ్యవహారాలతో పెద్ద ఎత్తున సంపాదించారు. చివరికి యాత్ర సినిమాకు డబ్బులు బ్లాక్ మనీ అంతా సురేషే పెట్టారని ప్రచారం. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో సురేష్ ఆటలు ఇక సాగవని సైలెంట్ అయ్యాడు. కానీ కూటమి సర్కార్ వదిలిపెట్టకుండా నేరాలను బయటపెట్టి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు తాజా కేసులతో మరోసారి జైలు కు వెళ్లడం ఖాయం అని అంత మాట్లాడుకుంటున్నారు.

  Last Updated: 18 May 2025, 06:38 PM IST