Site icon HashtagU Telugu

Another Scheme : ఏపీలో ఆగస్టు 15 నుండి మరో పథకం అమలు

Another Scheme Chandrababu

Another Scheme Chandrababu

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్నారు. గత నెలలో పెంచిన పెన్షన్ ను అమలు చేయడం తో పాటు ఉచిత ఇసుకను అమలు చేసారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇక ఆగస్టు 15 నుండి మరికొన్ని పథకాలు అమల్లోకి తీసుకరావాలని చూస్తున్నారు. అన్న క్యాంటిన్ , మహిళలకు ఫ్రీ బస్సు తో పాటు మరో పధకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఆగస్టు 15 నుండి ఇంటికే వైద్యాన్ని అందించే పథకం ప్రారభించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల వైద్యసేవల కోసం బడ్జెట్ లో రూ.680 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మూడు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న జబ్బు కావడంతో తొలి దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు. అందుకే క్యాన్సర్ రోగాన్ని తొలిదశలోనే గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read Also : Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు