ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ (AP Govt) ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. ఇప్పటికే పలు కీలక హామీలు అమలు చేసిన సర్కార్..ఇప్పుడు సరికొత్త పథకాలను ప్రజలకు అందిస్తుంది. త్వరలోనే మరో పథకం (Another Scheme) అమలు చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కుటుంబాలకు శుభవార్త తెలిపింది సర్కార్. కూటమి ప్రభుత్వం మహిళల పిల్లల విద్యకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తమ పిల్లల చదువుకోసం తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం కలిగించనున్నారు.
Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!
ఈ పథకాన్ని సెర్ఫ్ పరిధిలోని ‘స్త్రీనిధి బ్యాంక్’ ద్వారా అమలు చేయనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. రుణం రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఉండొచ్చు. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రుణాలపై కేవలం 4 శాతం వడ్డీ (అంటే రోజుకు 35పైసలు వడ్డీ) మాత్రమే వసూలు చేయనున్నారు.
రుణం తిరిగి చెల్లించేందుకు గరిష్ఠంగా 36 నెలల గడువు ఇవ్వనున్నట్లు సమాచారం. విద్యావ్యయాల కోసం తల్లులకు ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే ఈ పథక ఉద్దేశం. ప్రభుత్వ నిధులు, బ్యాంక్ సబ్సిడీ ద్వారా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది.