National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే

Andhra Pradesh ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి […]

Published By: HashtagU Telugu Desk
National Highway

National Highway

Andhra Pradesh ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మరో జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు నేషనల్ హైవే 16ను నాలుగు నుంచి ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. అనకాపల్లిలోని డైట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర నుంచి కాకినాడ జిల్లా మీదుగా, తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు వరకు రూ.3800 కోట్లతో 160 కిలోమీటర్ల హైవేను విస్తరించనున్నారు. ఈ 160 కిలోమీటర్లలో కాకినాడ జిల్లా పరిధిలో 80.6 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. మూడు చోట్ల బైపాస్‌లు, ఐదు చోట్ల అండర్ పాస్‌లు, 11 చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

కోల్‌కతా-చెన్నై రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో నాలుగు లైన్ల హైవేను ఆరు లైన్లుగా విస్తరిస్తున్నారు. అనకాపల్లి-దివాన్‌చెరువు నాలుగు లైన్లు ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ హైవేను 4 లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రతిపాదనలు చేయగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల బైపాస్‌ను అనకాపల్లి జిల్లా వడ్డిమెట్ట దగ్గర నుంచి చేపూరు వరకు నిర్మిస్తారు.

రెండో బైపాస్‌ను ఎర్రవరం దగ్గర 3 కిలోమీటర్లు, మూడో బైపాస్‌ను జగ్గంపేట దగ్గర 10 కిలోమీటర్లు నిర్మించనున్నారు.

ఈ హైవే విస్తరణలో భాగంగా.. చేపూరు, తేటగుంట, ధర్మవరం-ప్రతిపాడు మధ్య, యర్రవరం, బూరుగుపూడి, జగ్గంపేట బైపాస్‌ ప్రారంభం, ముగింపు దగ్గర, మల్లేపల్లి, గండేపల్లి, మురారి దగ్గర ఫ్లైఓవర్లు ప్లాన్ చేశారు. తేటగుంట క్రాస్‌ రోడ్డు, అన్నవరంలో అండర్‌పాస్‌ ఇరువైపులా సర్వీసు రోడ్లు, శంఖవరం వెళ్లే క్రాస్‌రోడ్డు, ప్రతిపాడు అండర్‌పాస్‌ విస్తరణ, జెడ్‌ రంగంపేట వెళ్లే క్రాస్‌ రోడ్డు దగ్గర అండర్‌పాస్‌లు ప్లాన్ చేశారు. అలాగే మరికొన్ని చోట్ల సర్వీసు రోడ్లు నిర్మించనున్నారు. మొత్తం మీద నేషనల్ హైవే 16ను నాలుగు నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. అటు విశాఖవైపు వెళ్లేవారికి, ఇటు విజయవాడవైపు వెళ్లేవారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.

 

  Last Updated: 27 Mar 2026, 11:02 AM IST