Site icon HashtagU Telugu

Amaravati: అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Amaravati

Amaravati

రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకోబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కొత్త ఊపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో, అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం రూ.9,000 కోట్ల భారీ రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రుణాలను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించనున్నట్లు సమాచారం. రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నిధుల లభ్యతను ప్రధాన అడ్డంకిగా భావించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం రాజధాని ప్రగతికి దారితీయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Vijay Deverakonda: మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!

ఈ మొత్తం రుణంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్‌సీఎల్‌) ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులను పూర్తిగా అమరావతి నగరంలోని రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ల్యాండ్ పూలింగ్ ప్రాంతాల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని బాధ్యతలను ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించారు. అదే విధంగా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌ (నాబ్‌ఫిడ్‌) నుంచి రూ.7,500 కోట్ల భారీ రుణం పొందేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇస్తోంది.

Ryan Ten Doeschate: టీమిండియాను హెచ్చ‌రించిన భార‌త కోచ్‌!

ఈ నిధులను అమరావతిలోని 4, 9, 12 జోన్లలో భవన సముదాయాల నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ల్యాండ్ పూలింగ్ పథకంలో భాగంగా ప్రజా సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. రుణ ఒప్పందాలు, హైపోథెకేషన్ డీడ్ వంటి అధికారిక ప్రక్రియలను ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ మరియు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీలకు బాధ్యతగా అప్పగించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో అమరావతిలో మౌలిక వసతుల పనులు ఇక శరవేగంగా కొనసాగనున్నాయి. ఈ నిర్ణయం రాజధాని నిర్మాణాన్ని కేవలం పునఃప్రారంభించడమే కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికతో అమరావతిని అభివృద్ధి దిశగా నడిపించే కీలక అడుగుగా భావిస్తున్నారు.

Exit mobile version