విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు పరుగులు తీస్తున్నాయి. విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ శాశ్వత క్యాంపస్ 20 ఎకరాలు […]

Published By: HashtagU Telugu Desk
Infosys In Visakhapatnam

Infosys In Visakhapatnam

Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు పరుగులు తీస్తున్నాయి.

  • విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ శాశ్వత క్యాంపస్
  • 20 ఎకరాలు శాశ్వత క్యాంపస్ కోసం కోరుతున్న ఇన్ఫోసిస్
  • ఎండాడ దగ్గర కేటాయించే ఛాన్స్.. త్వరలోనే క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి.. విశాఖపట్నానికి గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో పాటుగా మరికొన్ని కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆయా కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. తాజాగా ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నంలో శాశ్వతంగా క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. అందుకే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా.. సూత్రప్రాయకంగా అంగీకరించినట్లు సమాచారం. ఎండాడ దగ్గర 20 ఎకరాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ప్రతినిధులతో చర్చించారని.. ఈ నెలలో ఒక క్లారిటీ వస్తుందంటున్నారు.. అలాగే ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన చేయనున్నారట.

ఇన్ఫోసిస్‌తో పాటుగా అనుబంధ సంస్థలకు 50 దేశాల్లో క్యాంపస్‌లు ఉండగా.. దక్షిణాదిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మైసూరు, తిరువనంతపురంలో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో కూడా శాశ్వత క్యాంపస్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ విశాఖపట్నం ఐటీ హిల్స్‌లో ఉన్న తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. శాశ్వతంగా క్యాంపస్ నిర్మించి.. అక్కడే కార్యాకలాపాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారట.

విశాఖపట్నానికి వరుసగా ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.. మార్చి నెలలో శంకుస్థాపన చేయబోతున్నారు. రిలయన్స్ డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్లు రాబోతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో తాత్కాలికంగా క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు గతవారం శంకుస్థాపన చేయగా.. ఆ సంస్థ తాత్కాలిక క్యాంపస్‌ను కూడా ప్రారంభించింది. యాక్సెంచర్ కూడా విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది.. ముందు తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. మొత్తం మీద విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు వరుసగా వస్తున్నాయి.

ఐటీ కంపెనీలు మాత్రమే కాదు పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి.. విశాఖపట్నంతో పాటుగా పొరుగున ఉన్న అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన అనుమతులతో పాటుగా ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.. త్వరలోనే శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

  Last Updated: 16 Dec 2025, 12:07 PM IST