ఇప్పటికే వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం , రవాణా వ్యవస్థ స్థంభించింది. ఊర్లకు ఊర్లే వరదలో కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాలు పంట పొలాలు నాశనమయ్యాయి. వందలాది ఇల్లులు నేలమట్టం అయ్యాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే మరో తూఫాన్ ముప్పు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు.
ఇక తెలంగాణ లో ప్రస్తుతం 45 పునరావాస కేంద్రాలను తెరచి, 2,500 మందికిపైగా తరలించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. వరద తీవ్రత అధికంగా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు సహాయసహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇటు విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది.
Read Also : Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు