Site icon HashtagU Telugu

YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు

Another case registered against actor Posani Krishna Murali

Another case registered against actor Posani Krishna Murali

Posani Krishna Murali : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై ప్రముఖ నటుడు, వైఎస్‌ఆర్‌సీపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది. ఈ మేరకు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.

అంతేకాక..అనంతపురంలో తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. అయితే వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోసానిని విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు. ఇకపోతే..సినీనటి శ్రీరెడ్డిపైనా కూడా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మహిళా కార్యకర్తలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నాయకులు, సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాలతో పాటు ఇతర టీడీపీ నేతలు, వారి కుటుంబాలపై అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారు, నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. విశాఖపట్నంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మహిళా కార్యకర్తలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

కాగా, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు పోసాని కృష్ణ మురళి దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అయితే ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి వేరు . ఇప్పుడు పోసాని కృష్ణ మురళి వేరు. పోసాని కృష్ణ మురళి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు చాలా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రెస్ మీట్స్ లో పోసాని కృష్ణ మురళి మాట్లాడిన విధానం చాలామందికి నచ్చేది కాదు. చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ ని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

Read Also: Sree Leela Gifts To Allu Arjun :అల్లు అర్జున్ కు శ్రీలీల ఏ గిఫ్ట్ ఇచ్చిందో గిఫ్ట్ తెలుసా ..?