Site icon HashtagU Telugu

Srireddy : శ్రీ రెడ్డి పై మరోకేసు నమోదు..ఈసారి ఎక్కడంటే..!!

Srireddy Sorry

Srireddy Sorry

నటి శ్రీ రెడ్డి పై మరో కేసు నమోదైంది. శ్రీ రెడ్డి (Sri Reddy)..సోషల్ మీడియా లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని..కనీసం మా సభ్యత్వం కూడా ఇవ్వడం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి మీడియా చానెల్స్ ను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో చాలామంది తనతో ఎఫైర్లు నడిపించారని చెప్పి పలువురి హీరోల పేర్లు , దర్శకులు , నిర్మాతల పేర్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఈమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..ఆమెను పట్టించుకోవద్దంటూ వారంతా డిసైడ్ కావడమే కాదు పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం తో హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చేసింది. అప్పటి నుండి వైసీపీ కి సపోర్ట్ ఇస్తూ..జగన్ ఫై ఎవరైనా విమర్శలు , ఆరోపణలు చేస్తే వారిపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీ కి దగ్గరైంది. ఇక చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎంతోమందిపై నోరు పారేసుకున్న ఈమె..ఇటీవల కూటమి సర్కార్ అధికారం లోకి రావడం తో కాస్త సైలెంట్ అయ్యింది. కానీ కూటమి సైలెంట్ అవ్వదు గా..అధికార మదంతో ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారో..ఎలాంటి దాడులు చేసారో నారా లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్నాడు..ఇక ఇప్పుడు ఒక్కర్ని బయటకు లాగుతూ కేసులు నమోదు చేస్తున్నారు.

ఇప్పటికే జగన్ దగ్గరి నుండి మొదలుపెడితే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేల ఫై పలు కేసులు నమోదు చేయగా..ఇక శ్రీ రెడ్డి ఫై కూడా వరుసగా టిడిపి శ్రేణులు కేయూస్లు నమోదు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత రాజు యాదవ్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై నమోదు కేసులు నమోదు అవుతుండడం తో శ్రీరెడ్డి క్షేమపణలు కోరుతూ వస్తుంది. అయినప్పటికీ అమ్మడి పై వరుసగా కేసులు పెడుతున్నారు.

తాజాగా గుంటూరు మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి (Dasara Jyothy).. శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు (Chandrabab), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. మొత్తం మీద అప్పటి సీఎం జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు వణికిపోతూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని భయంతో బ్రతుకుతున్నారు.

Read Also : Skin Care Tips : చలికాలంలో అలోవెరా జెల్ ను ఇలా వాడండి, మీ చర్మం మెరుస్తుంది!