ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీ గిరిజనుల(Araku Valley Tribals) కష్టానికి మరోసారి గౌరవం దక్కింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి, మార్కెటింగ్ అవుతున్న అరకు వ్యాలీ కాఫీకి ప్రతిష్టాత్మకమైన ‘ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ముంబైలో జరిగిన ఘనమైన కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు హర్దీప్ సింగ్ పూరి ఈ అవార్డును జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారికి అందజేశారు. బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డ్స్‌లో ‘ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్’ కేటగిరీలో ఈ అవార్డు రావడం విశేషం.
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
అరకు వ్యాలీ కాఫీ అనేది గిరిజన రైతుల కృషి, సహకార వ్యవస్థకు ప్రతీక. ఎత్తైన కొండ ప్రాంతాల్లో గిరిజనులు సాగుచేసే ఆర్గానిక్ కాఫీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది. ఈ అవార్డు రావడం ద్వారా కేవలం కాఫీ బ్రాండ్‌కే కాదు, గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకూ గుర్తింపు లభించినట్లయింది. జీసీసీ ఈ కాఫీని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడం, రైతులకు న్యాయమైన ధరలు అందించడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం వంటి రంగాల్లో విశేష కృషి చేసింది.
అరకు కాఫీకి మరోసారి జాతీయ స్థాయిలో గౌరవం రావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని, గిరిజనుల కృషిని మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ అవార్డు ద్వారా అరకు వ్యాలీ కాఫీ ప్రాచుర్యం మరింతగా పెరిగి, గిరిజనుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది.