CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్‌స్థాయి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తాం. అభివృద్ధి అమరావతికే పరిమితం కాదు.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు.
Read Also: New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
మే 2న జరగనున్న అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మే 2న అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీ వస్తున్నారు. రూ.49,040 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వీటితో పాటు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలో డీఆర్‌డీవో, డీపీఐపీ, నాయ్, రైల్వే ప్రాజెక్టులకు మరో రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మాణం ఉంటుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు. వచ్చే మూడేళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం అన్నారు.
అమరావతి పనుల పునఃప్రారంభ పనులతో పాటు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలో డీఆర్‌డీవో, డీపీఐపీ, నాయ్, రైల్వే ప్రాజెక్టులకు మరో రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. విశాఖలో టీసీఎస్ రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా నిర్మిస్తున్నాం. శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ రూ.5వేల కోట్లు పెట్టబడులు పెట్టనుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి అని చంద్రబాబు నేతలకు తెలిపారు. అంతేకాక.. క్యాడర్‌ని నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మూడు పార్టీల నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడే కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేసుకున్నామన్నారు.
మహానాడు కడపలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా ఎన్డీయే గెలవాలని నేతలకు సూచించారు.కాగా, సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని కేవలం ఈ ఘటనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు నేతలతో అన్నారు. ఘటనా స్థలానికి వెళ్దామనుకుంటే.. భక్తుల దర్శనాలకు అంతరాయం ఏర్పడుతుందనే అమరావతి నుంచి సమీక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్..!