జనసేనాని పవన్ కల్యాణ్ ను వైసీపీ వ్యూహాత్మకంగా(Anjuyadav Episode) వాడేస్తోంది. రాజకీయంగా పండిపోయిన కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వినూత్న గేమ్ ఆడుతున్నారు. గత నాలుగేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గేమ్ నడిపిన కేసీఆర్ తరహాలోనే ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య జగన్మోహన్ రెడ్డి హైడ్రామాను నడుపుతున్నారు. ఆ క్రమంలోనే సీఐ అంజూయాదవ్ ఇష్యూను మలుచుకుంటున్నారు. సామాజికవర్గం కోణం నుంచి అంజూయాదవ్ ఎపిసోడ్ ను తీసుకెళుతున్నట్టు వినికిడి. ఆమె మీద సీరియస్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తోంది. ఆ లోపుగా పవన్ కల్యాణ్ ఎంత వరకు ఆ ఇష్యూను హైలెట్ చేస్తే అంత మంచిదన్నట్టు రాజకీయ వ్యూహాన్ని రచించినట్టు తాడేపల్లి వర్గాల్లోని టాక్.
సామాజికవర్గం కోణం నుంచి అంజూయాదవ్ ఎపిసోడ్ (Anjuyadav Episode)
కుల రాజకీయాలకు వేదికగా ఉన్న ఏపీ రాష్ట్రంలో ప్రధానంగా కాపు, బీసీల మధ్య పొసగదు. ప్రత్యేకించి యాదవులు, కాపుల మధ్య వైరం ఈనాటిది కాదు. పూర్వం నుంచి ఆ రెండు కులాల మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతోంది. అందుకే, యాదవులు రాజకీయంగా టీడీపీ వైపు ఎక్కువగా ఉంటారు. అలాగే, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా కాపులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే వాళ్లు. బలిజ, శెట్టిబలజ, తెలగ, ఒంటరి కులాలు ఎక్కువగా టీడీపీ వైపు ఉంటారని గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్థమవుతోంది. రాయలసీమ వ్యాప్తంగా తొలి నుంచి బలిజ, ఒంటరి కులాలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా యదవులు, కాపుల మధ్య ఆదిపత్యపోరు (Anjuyadav Episode) పూర్వం నుంచి నడుస్తోందని సర్వత్రా తెలిసిందే.
పోలీస్ ఆఫీసర్ మీద ఫిర్యాదు చేయడానికి రాజకీయ ర్యాలీ చేసిన పవన్
వెనుకబడిన వర్గాలు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా 151 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అందుకే, బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో, అన్ని కార్పొరేషన్లను జగన్మోహన్ రెడ్డి వేశారు. ఆ ఓటు బ్యాంకు తిరిగి టీడీపీకి వెళ్లకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. కానీ, నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తరువాత బీసీలు తిరిగి టీడీపీ వైపు మళ్లుతున్నారని తాజా సర్వేల సారాంశం. అందుకే, ఇప్పుడు అంజూయాదవ్ ఎపిసోడ్ తో బీసీలను ఆకట్టుకునే మాస్టర్ స్కెచ్ జగన్మోహన్ రెడ్డి వేసినట్టు తెలుస్తోంది. ఆమె మీద యుద్ధం చేయడానికి పవన్ సిద్ధమయ్యారు. గత వారం రోజులుగా అంజూ యాదవ్ (Anjuyadav Episode) చుట్టూ జనసేనాని రాజకీయాన్ని రక్తికట్టించారు. లక్ష మందితో వస్తున్నా..కాస్కో అంటూ అంజూయాదవ్ కు వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి పరిణామం వైసీపీకి కావాలి. అందుకే పవన్ ఎంత ఎగిరిపడుతున్నా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున రియాక్ట్
తిరుపతి వెళ్లిన పవన్ ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలవడానికి పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఫిర్యాదు చేయడానికి రాజకీయ ర్యాలీ చేసిన పార్టీ చీఫ్ గా పవన్ రికార్ట్ ల్లో నిలిచిపోతారు. ఆ ర్యాలీ తీయడాన్ని బీసీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పైగా విధుల్లో భాగంగా అంజూయాదవ్ జనసేన నాయకుని మీద చేయి చేసుకోవాల్సి వచ్చిందని (Anjuyadav Episode) బీసీ నాయకులు చెబుతున్నారు. సోమవారం తిరుపతిలో పవన్ నిర్వహించిన ర్యాలీ మీద బీసీ నాయకులు మీడియా ముందుకొస్తున్నారు. ఒక వేళ అంజూయాదవ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున రియాక్ట్ కావడానికి సిద్ధమయ్యారు. అదే జరిగితే, జనసేనతో పాటు టీడీపీ మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందని వైసీపీ వ్యూహంలోని ఆంతర్యం.
Also Read : Janasena : పవన్ కళ్యాణ్‌పై మంత్రులు నోరుపారేసుకోవద్దు.. మంత్రులకు జనసేన నేత హెచ్చరిక
వారాహి యాత్రను వ్యూహత్మంగా వైసీపీ హైలెట్ అయ్యేలా చేస్తోంది. ఆ విషయాన్ని గమనించని పవన్ సీఎం రేస్ లో ఉన్నానంటూ రెచ్చిపోతున్నారు. యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వలంటీర్లను కదిలించారు. తొలి రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన పవన్ మీద రాజకీయ అజ్ఞాని ముద్రను వైసీపీ వేసింది. ఆ తరువాత సుమారు 5లక్షల మందికి చెందిన సచివాలయ వ్యవస్థ రద్దు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దానికి పరోక్షంగా చంద్రబాబు మద్ధతు పలికారు. దీంతో ప్రత్యక్షంగా 5లక్షల ఓట్లతో పాటు వాళ్లకు చెందిన కుటుంబీకులు టీడీపీ, జనసేన గురించి నెగిటివ్ గా మట్లాడుకునే పరిస్థితిని వైసీపీ కల్పించింది.
Also Read : Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్ద అసలు అవసరం లేదు.. మళ్ళీ మళ్ళీ.. వాలంటీర్ల గురించే మాట్లాడుతున్న పవన్..
జనసేన, వైసీపీ చుట్టూ గత రెండు వారాలుగా ఏపీ రాజకీయాన్ని తిప్పేలా ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీని వీలున్నంత బలహీన పరచడానికి జనసేనాని పవన్ యాత్రను వ్యూహాత్మకంగా వైసీపీ వాడేసుకుంటోంది. అంజూయాదవ్ ఎపిసోడ్ ద్వారా బీసీ ఓటు బ్యాంకును పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే, ఇప్పటి వరకు ఆమె మీద చర్యలు తీసుకోలేదు. జనసేనాని పవన్ ఆ ఎపిసోడ్ ను తారాస్థాయికి తీసుకెళ్లే వరకు అంజూయాదవ్ మీద చర్యలు తీసుకోకుండా వ్యూహాత్మక కథను వైసీపీ నడుపుతోంది. ఇలా పవన్ కు తెలియకుండా సినిమాల్లో మాదిరిగా ఆయన్ను వాడేసుకుని ముక్కోణపు పోటీ దిశగా ఏపీ రాజకీయాన్ని తీసుకెళ్లడం వైసీపీ లక్ష్యం.