వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా మాస్ డైలాగ్స్ వినాలంటే బోయపాటి సినిమాలు చూడాలి..ముఖ్యంగా బాలయ్య (Balakrishna) తో బోయపాటి పేల్చే డైలాగ్స్ మరెవరు కూడా పేల్చేలేరు. ఆ రేంజ్ లో బాలయ్య తో మాస్ డైలాగ్స్ చెప్పిస్తారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..బోయపాటి రేంజ్ లో డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి చెప్పిన డైలాగ్ ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
అలాంటి అనిల్..ప్రస్తుతం ఎంపీ బరిలో నిల్చుబోతున్నాడు. ఈ క్రమంలో జగన్ (Jagan) ఫై తన అభిమానాన్ని చాటుకుంటూ వార్తల్లో హైలైట్ అవుతున్నారు. తాజాగా ఎన్నికల పోరు ఫై మాట్లాడారు. తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానే తప్ప వెనకడుగు వేయనని అన్నారు. జగన్ కోసం రామబంటులా పని చేస్తానని , నరసరావుపేట ఎంపీగా గెలిచాక ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పుకొచ్చారు. పల్నాడు గడ్డ ప్రజలు తనను అక్కున చేర్చుకోవడంతో నెల్లూరు వదిలి వచ్చినపుడు కలిగిన బాధ పోయిందన్నారు. జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు.
Read Also : BRS ‘Water Fight’ : ‘నీటి పోరు’ యాత్రకు సిద్దమైన బిఆర్ఎస్