Site icon HashtagU Telugu

Anil Kumar Yadav : తొక్కుతాం బిడ్డా..అంటూ నారా లోకేష్ ఫై అనిల్ కుమార్ ఫైర్

Anil Lokesh

Anil Lokesh

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార పార్టీ దూకుడు మరింత పెంచుతుంది. ఈరోజు ఆఖరి సిద్ధం (Siddham) సభను బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ (Nara Lokesh)ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్కడో ఉండి, డ్రోన్ పంపించి బయట ఉన్న ఖాళీ స్థలాలు చూపించడం కాదు. నువ్వు మగాడివైతే ఇక్కడికి రా. లక్షల మంది సాక్షిగా తొక్కుతాం బిడ్డా. ఇక్కడున్న వైసీపీ కార్యకర్తలు అరిస్తే ఆ శబ్దానికే చచ్చిపోతావ్’ అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అందుకే పొత్తులు పెట్టుకున్నారని అనిల్‌ తెలిపారు. వైసీపీని ఎదుర్కోవడానికి ఎంతమంది వచ్చినా జగన్‌ మరోసారి గెలిచి సీఎం అవుతారని , జగన్ కు అన్ని వర్గాల వారి మద్దతు ఉంటుందని తెలిపాడు. జగన్ ను మళ్లీ సీఎం గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని , మరో 45 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, జగన్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు జగనన్నను మరోసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ..సిద్ధం సభ సాక్షిగా చెప్పుకొచ్చారు.

Read Also : AP BJP : ఏపీలో బీజేపీ ఆ కొన్ని సీట్లు ఎలా గెలుస్తుంది.?