Chintamani Drama Ban: చితామ‌ణి నాట‌క నిషేధం.. ఏపీ స‌ర్కార్ పై హైకోర్టు సీరియ‌స్..?

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 01:36 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చింతామ‌ని నాట‌కం నిషేధం పై ఇప్ప‌టికే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్దఎత్తున ర‌చ్చ లేపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా చింతామ‌ణి నాట‌క నిషేదం పై ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఏపీలో చింతామ‌ణి నాట‌కం పై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జ‌ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసిన క్ర‌మంలో తాజాగా న్యాయ‌వాది ఉమేష్ చంద్ర వాద‌నలు వినిపించారు.

ఈ నేప‌ధ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చింతామ‌ణి నాట‌కం నిషేధంపై ఏపీ ప్ర‌భుత్వం పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అస‌లు చింతామణి పుస్తకాన్ని రద్దు చేయకుండా నాటకాన్ని ఎలా రద్దు చేస్తారని ధ‌ర్మాస‌నం ప్రశ్నించడం విశేషం. అలాగే నాటకంలో పాత్రలు వేటిపైనైనా అభ్యంతరాలుంటే పాత్రను రద్దు చేయాలే తప్ప నాటకాన్ని రద్దు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

ఇక‌ ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. అదే సమయంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇత‌ర అధికారులు అంద‌రూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మ‌రి చింతామ‌ణి నాట‌క నిషేధం విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల పై ఏపీ స‌ర్కార్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.