Chalo Vijayawada: విజ‌య‌వాడ‌లో టెన్ష‌న్,టెన్ష‌న్.. పక్కా స్కెచ్‌తో ఉద్యోగులు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌లో విజయవాడ కార్య‌క్ర‌మంకోసం, భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో, రాష్ట్ర‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ ప్రారంభమయ్యే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ఖాకీల‌ వలయంలోకి వెళ్లిందని స‌మాచారం.

  • Written By:
  • Updated On - February 3, 2022 / 12:06 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌లో విజయవాడ కార్య‌క్ర‌మంకోసం, భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో, రాష్ట్ర‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ ప్రారంభమయ్యే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ఖాకీల‌ వలయంలోకి వెళ్లిందని స‌మాచారం.

ఈ క్ర‌మంలో మీసాల రాజేశ్వరరావు వంతెన సీతమ్మ పేట జంక్షన్ వద్ద వందలాదిగా పోలీసులు బలగాలు మోహరించారు. చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బీఆర్‌టీఎస్ రోడ్డుకు రాకుండా అడుగడుగునా పోలీసులు మోహరించడంతో పాటు, ఎక్క‌డిక‌క్క‌డ ఆంక్ష‌లు విధించ‌డంతో అక్క‌డ‌ టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే మ‌రోవైపు ఉద్యోగులు మాత్రం ప‌క్కా స్కెచ్‌తో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి చేరుకుంటున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు ప్ర‌కటించినా, ఉద్యోగులు మాత్రం వేల సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో బీఆర్టీఎస్ రోడ్డులోకి ఉద్యోగులను అనుమతించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

పీఆర్సీ సాధన సమితి ఇంటలిజెన్స్ కు కూడా అందకుండా పక్కా ప్లాన్ చేయడంతోనే చలో విజయవాడ కార్యక్రమానికి వేలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. ఎన్జీవో భవన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉద్యోగులు శారద కళాశాల సమీపంలో బీఆర్టీఎస్‌కు చేరుకోగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే వారంతా పోలీసులకు చిక్కకుండా శారదా కాలేజీ సమీపంలోని శివరామయ్య క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంలో భాగంగా తాము బీఆర్టీఎస్‌కు చేరుకున్నామని, పోలీసుల‌ను మోహ‌రించి త‌మ‌ను అడ్డుకోలేర‌ని, ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం చీక‌టి జీవోల‌ను ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.