Suicide News: ఏ కష్టమొచ్చిందో.. నీటిలో దూకిన పదేళ్ల కూతుళ్లతో సహా తల్లి

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో ఏమోగానీ పదేళ్ల కుమార్తెలతో కలిసి తల్లి నదిలో దూకి తనువు చాలించింది.

Published By: HashtagU Telugu Desk
Suicide

Suicide

Suicide News: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో ఏమోగానీ పదేళ్ల కుమార్తెలతో కలిసి తల్లి నదిలో దూకి తనువు చాలించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నదిలో దూకి మృతి చెందింది. ముదిగుబ్బ మండలం గడ్డంపల్లి తండా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సుకన్య (35), ఆమె కుమార్తెలు దేవయాని (10), జస్మిత (9)గా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతదేహాలను బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంటి సమస్యల కారణంగానే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సుకన్య భర్త గంగాధర్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆమె ఇద్దరు కూతుళ్లతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

Read More: Triangle Fight In Telangana: బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర: బండి సంజయ్

  Last Updated: 02 Jul 2023, 05:27 PM IST