Site icon HashtagU Telugu

Aadudam Andhra : ఐపీఎల్‌కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి

Aadudam Andhra

Aadudam Andhra

Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌కు గొప్ప అవకాశం లభించింది. విజయనగరం జిల్లా జామి మండలం అలమండకు చెందిన కె.పవన్‌ను చెన్త్నె సూపర్‌ కింగ్స్‌  టీమ్  దత్తత తీసుకుంది. అతడికి ట్రైనింగ్ ఇచ్చి జట్టులో ఆడే అవకాశాన్ని సీఎస్కే కల్పించనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన క్రీడా యజ్ఞం ‘ఆడుదాం–ఆంధ్రా’ క్రీడా పోటీలకు కె.పవన్‌ హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటుకున్నాడు. పవన్‌లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్‌కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది. ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు విచ్చేసిన సీఎస్‌కే టీమ్ పరిశీలకులు టాలెంట్‌ హంట్‌లో భాగంగా పవన్‌ను ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

వివరాల్లోకి వెళ్తే.. పవన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఆడేవాడు. క్రికెట్‌ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీల్లో పవన్‌ పాల్గొన్నాడు.  ‘‘ఆడుదాం–ఆంధ్రా  పోటీల వల్లే మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్‌కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి నన్ను అభినందించారు’’ అని పవన్‌(Aadudam Andhra) చెప్పుకొచ్చాడు.

Also Read : 500 Wickets : అశ్విన్‌ రికార్డ్.. 500 టెస్ట్‌ వికెట్లు కైవసం