Site icon HashtagU Telugu

Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌’.. ఎందుకో తెలుసా ?

Amaravati Drone Summit 2024 Andhra Pradesh

Drone Summit : ఈనెల 22, 23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024’ జరగబోతోంది.  మంగళగిరి సీకే కన్వెన్షన్‌ వేదికగా ఈ సదస్సు జరగబోతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు. ఇందుకోసం 9 సెషన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు ప్రజెంటేషన్లు ఇస్తారు.  ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు జరుగుతాయి. ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరవుతారు.

Also Read :Agniveer : ఏపీలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం

Also Read :Dumstick Benefits : మునగ మగవారికే కాదు స్త్రీలకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలుసా..?