AP Jobs – 3220 : ఏపీలో భారీ నోటిఫికేషన్.. యూనివర్సిటీల్లో 3220 జాబ్స్ భర్తీ

AP Jobs - 3220 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 11:02 AM IST

AP Jobs – 3220 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 18 యూని­వర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్‌ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి.  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులలో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన 220 లెక్చరర్‌ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 17 సంవత్సరాల తరువాత విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. ఈరోజు నుంచి ఏపీ ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్‌ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒకే ఫీజును చెల్లించి అన్ని యూనివర్సిటీల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అప్లై చేసే వెసులుబాటు ఉంది. అభ్య­ర్థు­లపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో టెస్ట్‌లు రాయాలనుకుంటే విడివిడిగా ఫీజులు చెల్లించాలి.
  • ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపునకు తుది గడువు నవంబరు 20.
  • పోస్టు ద్వారా భౌతికంగా దరఖాస్తు సమర్పణ, ఇతర పత్రాల సమర్పణకు తుది గడువు నవంబరు 27.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితాను నవంబరు 20న రిలీజ్ చేస్తారు.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను డిసెంబరు 8న (AP Jobs – 3220) రిలీజ్ చేస్తారు.

Also Read: Trains Cancelled : రైలు ప్రమాదం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు