Site icon HashtagU Telugu

AP Investments: పెట్టుబడుల్లో అగ్ర‌గామిగా ‘జ‌గ‌న్ స‌ర్కార్’ రికార్డ్

cm jagan

ఏపీ రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు రావ‌డంలేద‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి భిన్నంగా పెట్టుబ‌డుల‌ను తీసుకురావ‌డంలో దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ సంపాదించింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారానికి భిన్నంగా గ‌త ఏడు నెల‌ల నివేదిక ఉంది. సుమారు 40,361 కోట్లు పెట్టుబ‌డులు ఏపీ రాష్ట్రానికి కేవ‌లం ఏడు నెల‌ల్లో వ‌చ్చిన‌ట్టు డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) నివేదిక ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జులై నెల నివేదికను వెల్ల‌డించింది. దాని ప్ర‌కారం 7నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 కోట్లు రాబట్టినట్టు చెబుతోంది. ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా రాష్ట్రం ఏడు నెలల కాలంలో రూ.36,828 కోట్ల పెట్టుబడుల‌ను ఆక‌ర్షించింది. ఈ రెండు రాష్ట్రాలది దేశ వ్యాప్తంగా పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ మొత్తంలో 45 శాతం ఉంద‌ని డీపీఐఐటీ తెలిపింది. దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు 7 నెల‌ల్లో వచ్చినట్టు వెల్లడించింది.

గ‌త 7నెల‌ల వేగం రాబోవు రోజుల్లో కూడా ఉంటుంద‌ని ఏపీ స‌ర్కార్ చెబుతోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్షాల చేస్తోన్న ప్ర‌చారానికి తెర‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. పారిశ్రామికీక‌ర‌ణ వేగ‌వంతం చేయ‌డంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌ను భారీగా తీసుకురావ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నం గ‌త 7నెల‌ల్లో ఆశించిన ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్టు డీపీఐఐటీ నివేదిక‌ను గ‌మ‌నిస్తే స్ప‌ష్టం అవుతోంది.